BOOKS RELEASED  _ ముత్యపు పందిరి వాహన సేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ

TIRUPATI, 30 NOVEMBER 2024: On the third morning during the ongoing annual fest at Tiruchanoor, four devotional books were released.

TTD EO Sri J Syamala Rao released Bhagavata Kathalu by Prof. Sarvottama Rao, Mahabharata Gadhalu by Prof. Sumati Narendra, Ramayana Gadhalu-Mahilalu by Prof. Malayavasini, Aryakathanidhi by Sri Vavikolanu Subba Rao and felicitated the authors on the occasion.

JEO Sri Veerabrahmam, DyEO Sri Govindarajan, Special Officer Publications Dr Vibhishana Sharma, subeditor Dr Narasimhacharyulu were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ముత్యపు పందిరి వాహన సేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
 
తిరుపతి, 2024 నవంబరు 30: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజైన శనివారం ఉదయం జరిగిన ముత్యపు పందిరి  వాహన సేవలో నాలుగు ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు ఆవిష్కరించారు.
                       
భాగవత గాథలు – మహిళలు : ఆచార్య కె.సర్వోత్తమరావు
      `                         
సకల వేదంతసారం భాగవతం. వేదవ్యాసమహర్షి.  భగవంతుని అవతార లీలాగాథ వైభవంగా కీర్తించబడుతున్న భాగవతంలోని ప్రముఖ మహిళాపాత్రలను గురించి విశ్లేషిస్తున్నది ఈ గ్రంథం.
 
భాగవతంలోని మహిళల స్వరూప స్వభావాలను, వ్యవహార శైలిని, అభిప్రాయవ్యక్తీకరణను, కథాంశాలను అనుసరించి మహిళా దేవతలు, దివ్యమహిళలు, ప్రముఖమహిళలు, ద్వారకాపురమహిళలు, గ్రామీణ మహిళలుగా వర్గీకరించి వారి గురించి క్షుణ్ణంగా వివరించారు. 
 
మహాభారత గాథలు –  మహిళలు : ఆచార్య సుమతీ నరేంద్ర
                      `                                                                                                                                     
భారతీయ సంస్కృతి అవగాహనకు శ్రీమద్రామాయణ, మహాభారత ఇతిహాసాలు కరదీపికల్లాంటివి.  
 
భారతంలోని స్త్రీ పాత్రల కథలను చదివితే వారి వ్యక్తిత్వాలు, అభిప్రాయాలు ఎంత ఉన్నతమైనవో తెలుస్తాయి. మహాభారతకాలంలో స్త్రీలకు శాస్త్రపరిజ్ఞానం ఉండేదనీ, సమయసందర్భాలను బట్టి వాటిని ప్రకటించేవారని తెలుస్తున్నది. ఇలాంటి మహిళలకు సంబంధించిన విశేషాలను సామాన్య పాఠకులకు తగినట్లు సరళమైన భాషలో రచన చేశారు. 
 
రామాయణ గాథలు – మహిళలు : ఆచార్య కోలవెన్ను మలయవాసిని
                                                          
ఆదికవి వాల్మీకి రచించి, మధురంగా గానం చేసిన కుటుంబగాథా కావ్యం, మానవతావిలువలతో నిండిన ఆదికావ్యం రామాయణం. వాల్మీకి సృష్టించిన ప్రతిపాత్ర ఎంతో ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. 
 
ఇందులోని మహిళాపాత్రలు ఎంతో ఉజ్జ్వలంగా తీర్చబడినారు. ఈ కావ్యవస్తువును ముందుకు నడిపించిన వారంతా మహిళలే కావడం విశేషం.రామాయణంలోని మహిళలంతా వారివారి పాత్రౌచిత్యాన్ని చక్కగా నిర్వర్తించారు. 
 
ఆర్యకథానిధి : శ్రీవావిలికొలను సుబ్బారావు
                                            
ఒంటిమిట్ట కోదండరామస్వామి  ఆలయానికి విశేష సేవ చేసిన శ్రీ వావిలికొలను వారి రచనలలో ‘ఆర్యకథానిధి’’ ప్రధానమైనది. 
 
‘ఆర్యకథానిధిలో’ 132 కథలున్నాయి. ఈ కథలన్నీ ముఖ్యంగా శ్రీమద్రామాయణం, మహాభారతం, భాగవతాది గ్రంథాలలోనివే. ఇవేగాక పంచతంత్రం బృహత్కథలోనివి కూడా కొన్ని వున్నాయి. వీటితోబాటు  జనవ్యవహారంలో వేళ్ళూనుకున్న కథలను కూడా తన రచనలో పొందుపరచినారు.
 
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ప్రచురణల విభాగం ప్ర‌త్యేకాధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ, ఉపసంపాదకులు డా. నరసింహాచార్య, రచయితలు పాల్గొన్నారు.
 
టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.