METLOTSAVAM HELD _ మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలం

Tirupati, 25 March 2025: Trekking the Alipiri footpath is divine bliss said Sri. Rajagopala Rao, Director of TTD Annamacharya Project.

He said under the auspices of the TTD Annamacharya Project, Sri Tallapaka Annamacharya 522nd Death Anniversary was celebrated on Tuesday morning at the Alipiri Padala mandapam.

Speaking on this occasion, he said that many dignitaries reached Tirumala along this route and were blessed with the divine grace of Srivaru. ”It is a great honour to participate in such a celebration”, he maintained.

He explained that great personalities like Sri Annamacharya and Sri Krishna Devaraya climbed the Tirumala hills with devotion and spread the glory of Swami varu throughout the world. Metlotsavam is being observed every year in a grand manner on this occasion, he added.

Artists of the Annamacharya Project and more than 700 members of Bhajan Mandals from Andhra Pradesh climbed Tirumala singing Annamacharya Sankeertans.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలం

•⁠ ⁠అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు శ్రీ రాజ‌గోపాల‌రావు

•⁠ ⁠భజనమండళ్ల గోవింద నామస్మరణతో మార్మోగిన నడకమార్గం

తిరుపతి, 2025 మార్చి 25: పూర్వం నుండి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడిచివెళ్లి స్వామివారి కృపకుపాత్రులయ్యారని టీటీడీ అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు శ్రీ రాజ‌గోపాల‌రావు చెప్పారు.
ఇలాంటి మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమన్నారు.

టీటీడీ అన్న‌మాచార్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో శ్రీ‌మాన్ తాళ్ల‌పాక అన్న‌మాచార్యుల 522వ వ‌ర్థంతి మ‌హోత్స‌వాల‌లో భాగంగా మంగళవారం ఉద‌యం అలిపిరి పాదాలమండపం మెట్లోత్సవం వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా శ్రీ రాజ‌గోపాల‌రావు మాట్లాడుతూ శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ ఆనంద తీర్థ చార్యులు, అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు మ‌రియు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాదాపు 700 మందికిపైగా భజనమండళ్ల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలకు చేరుకున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.