SPECIAL FESTIVALS IN MAY AT SRI GOVINDARAJA SWAMY TEMPLE _ మేనెలలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
TIRUMALA, 24 APRIL 2025: Several special festivals will be observed during the month of May at Sri Govindarajaswamy Temple in Tirupati.
The details are as follows:
May 1 to 10: Madhurakavi and Sri Ananta Alwar Utsavam.
May 2: Bhashyakarla Sattumora.
May 3: Bhashyakarla Gandhapodi Utsavam.
May 8: On the occasion of Uttara Nakshatram, Sri Govindaraja Swamy along with Sri Devi and Bhu Devi will bless the devotees on a special procession at 6 PM.
May 9 to 11: Bugga Utsavam.
May 12: Ponnakalva Utsavam
May 16, 23, and 30 (Fridays): Sri Andal Ammavari Procession
May 19: On the occasion of Sravana Nakshatram, Sri Kalyana Venkateswara Swamy along with Sri Bhu Devis will be taken on a procession along the Mada streets at 6 PM.
May 27: On the occasion of Rohini Nakshatram, Sri Parthasarathi Swamy along with Rukmini and Satyabhama will bless devotees on a procession at 6 PM.
May 31 to June 9: Nammalwar Utsavam.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మేనెలలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2025 ఏప్రిల్ 24: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
– మే 1 నుండి 10వ తేదీ వరకు మధురకవి మరియు శ్రీ అనంత అళ్వార్ ఉత్సవం.
• మే 2న భాష్యకార్ల శాత్‌మొర నిర్వహించనున్నారు.
– మే 3న భాష్యకార్ల గంధపు పొడి ఉత్సవం.
– మే 8న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
– మే 9 నుండి 11వ తేదీ వరకు బుగ్గోత్సవం.
– మే 12న శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం.
– మే 16, 23, 30వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
– మే 19వ తేదీ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీభూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
– మే 27న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.
– మే 31 నుండి జూన్ 9వ తేదీ వరకు నమ్మాళ్వార్ ఉత్సవం.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.