SPECIAL FESTIVALS IN MAY AT SRI KODANDARAMA TEMPLE _ మే నెల‌లో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

TIRUPATHI, 25 APRIL 2025: Special religious events are scheduled to take place at the Sri Kodandarama Swamy Temple in Tirupati throughout the month of May.

On May 3, 10, 17, 24, and 31 (Saturdays), Abhishekam to the presiding deities Sri Sita, Rama, and Lakshmana will be performed at 6:00 AM. In the evening at 5:00 PM, the utsava murthis will be taken on a procession around the four Mada streets, followed by the Unjal Seva inside the temple.

On May 2, Ankurarpanam for the Pushpayagam will be conducted.

On May 3, the Pushpayagam will take place from 4:00 PM to 6:00 PM at the temple.

On May 12, on the occasion of Pournami, the Ashtottara Shatakalasabhishekam will be performed at 8:30 AM. On the same evening at 5:30 PM, Sri Kodandarama Swamy along with Sita and Lakshmana will be taken in a procession along the four Mada streets.

On May 18, Sri Kodandarama Swamy Asthanam will be conducted at 8:00 AM at the Annamacharya Kalamandiram.

On May 22, marking Hanuman Jayanti, the Hanumantha Vahanam procession will take place at 7:00 PM.

On May 27, on the occasion of Amavasya, Sahasra Kalasabhishekam will be performed at 8:00 AM followed by Hanumantha Vahanam in the evening at 7:00 PM.

On May 30, on the auspicious Punarvasu Nakshatram, the Sita-Rama Kalyanam will be held at 11:00 AM.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

మే నెల‌లో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2025 ఏప్రిల్ 25: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మే నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.

– మే 3, 10, 17, 24, 31వ తేదీల్లో శనివారం సంద‌ర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వ‌హిస్తారు. సాయంత్రం 5 గంట‌లకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంత‌రం ఆలయంలో ఊంజల్‌సేవ జ‌రుగ‌నుంది.

– మే 2న ఆల‌యంలో పుష్ప‌యాగానికి అంకురార్ప‌ణ‌.

– మే 3న శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం.

– మే 12వ తేదీ పౌర్ణమి నాడు ఆలయంలో ఉద‌యం 8.30 గంట‌ల‌కు అష్టోత్తర శతకలశాభిషేకం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల ఊరేగి ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

– మే 18న అన్న‌మాచార్య క‌ళామందిరంలో ఉద‌యం 8 గంట‌లకు శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆస్థానం.

– మే 22న హ‌నుమ‌జ‌యంతి సంద‌ర్భంగా రాత్రి 7 గంట‌ల‌కు హ‌నుమంత వాహ‌నం.

– మే 27న అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.

– మే 30వ తేదీ పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.