ANNUAL BRAHMOTSAVAMS OF SRI VEDANARAYANA SWAMY TEMPLE FROM MAY 1 TO 9 _ మే 01 నుండి  9వ‌ తేదీ వరకు శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, April 11, 2026: The annual Brahmotsavams of Sri Vedanarayanaswamy along with Sri Vedavalli Ammavaru at Nagalapuram will be conducted in a grand manner from May 1 to May 9. The festivities will commence with Ankurarpanam on the evening of April 30. In this connection, Koil Alwar Thirumanjanam will be performed on April 28.

Vahana Sevas will be held ყოველდღaily from 8:00 AM to 9:30 AM and from 7:30 PM to 9:00 PM.

Schedule of Vahana Sevas:

May 1, 2026

Morning: Dwajarohanam (between 5:30 AM and 6:30 AM in Mesha Lagnam)

Night: Pedda Sesha Vahanam

May 2, 2026

Morning: Chinna Sesha Vahanam

Night: Hamsa Vahanam

May 3, 2026

Morning: Simha Vahanam

Night: Mutyapu Pandiri Vahanam

May 4, 2026

Morning: Kalpavriksha Vahanam

Night: Sarvabhoopala Vahanam

May 5, 2026

Morning: Mohini Avatara

Night: Garuda Vahanam

May 6, 2026

Morning: Hanumantha Vahanam

Night: Gaja Vahanam

May 7, 2026

Morning: Surya Prabha Vahanam

Night: Chandra Prabha Vahanam

May 8, 2026

Morning: Rathotsavam (6:00 AM to 10:30 AM)

Evening: Arjita Kalyanotsavam (4:30 PM to 6:30 PM)

Night: Ashwa Vahanam

May 9, 2026

Morning: Chakrasnanam (11:30 AM to 11:45 AM)

Night: Dhwajavarohanam (7:30 PM to 8:00 PM)

On the eighth day (May 8), the celestial Kalyanotsavam of the Lord will be performed grandly from 4:30 PM to 6:30 PM. Devotee couples can participate by paying ₹750. Participants will be presented with one Uttareeyam, one blouse piece (ravike), one laddu, and one vada as prasadam.

On this occasion, under the auspices of TTD Hindu Dharma Prachara Parishad, Annamacharya Project, and Dasa Sahitya Project, Harikatha, music and cultural programs, bhajans, and kolatam will be conducted daily.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI         
 

మే 01 నుండి  9వ‌ తేదీ వరకు శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2026 ఏప్రిల్ 11: నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 01 నుండి 9వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.  ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఏప్రిల్ 28వ తేదిన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.

వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 9 గంటల వరకు నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు : 

తేదీ

01-05-2026

ఉదయం – ధ్వజారోహణం( మేష‌లగ్నంలో ఉద‌యం 5.30 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు)

రాత్రి  – పెద్దశేష వాహనం

02-05-2026      

ఉదయం – చిన్నశేష వాహనం              

రాత్రి  – హంస వాహనం

03-05-2026

ఉదయం – సింహ వాహనం                  

రాత్రి  – ముత్యపుపందిరి వాహనం

04-05-2026

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి  – సర్వభూపాల వాహనం

05-05-2026

ఉదయం – మోహినీ అవతారం

రాత్రి  – గరుడ వాహనం

06-05-2026

ఉదయం – హనుమంత వాహనం

రాత్రి  – గజ వాహనం

07-05-2026

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి  – చంద్రప్రభ వాహనం

08-05-2026

ఉదయం – రథోత్సవం  ( ఉద‌యం 6 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు)  

సాయంత్రం – ఆర్జితకల్యాణోత్సవం ( సాయంత్రం 4.30 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు)

రాత్రి  – అశ్వవాహనం

09-05-2026

ఉదయం – చక్రస్నానం (ఉద‌యం 11.30 నుండి 11.45 గంట‌ల వ‌ర‌కు)

రాత్రి  – ధ్వజావరోహణం ( రాత్రి 7.30 నుండి 8 గంట‌ల వ‌ర‌కు)

బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మే 8వ తేదీన సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.750/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.