TEPPOTSAVAMS AT DEVUNI KADAPA FROM MAY 10-12 _ మే 10 నుండి 12వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు
TIRUPATHI, 09 MAY 2025: The annual Tepotsavams at Sri Lakshmi Venkateswara Swamy Temple in Devuni Kadapa will be held from May 10 to 12.
Sri Venkateswara Swamy, along with Sridevi and Bhudevi, will be taken on a float in a procession in the temple Pushkarini each evening—completing 3 rounds on the first day, five on the second, and seven on the final day.
Evening cultural events such as devotional music concerts, Harikatha, and Kolatam will be organized by the TTD-run HDPP, Dasa Sahitya Project, and Annamacharya Project.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మే 10 నుండి 12వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు
తిరుపతి, 2025 మే 09: వైఎస్సార్ కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 10 నుండి 12వ తేదీ వరకు తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఆలయ పుష్కరిణిలో మూడు రోజుల పాటు సాయంత్రం వేళ తెప్పలపై విహరించనున్నారు. స్వామి, అమ్మవారు మొదటి రోజు మూడు చుట్లు, రెండో రోజు ఐదు చుట్లు, చివరి రోజు ఏడు చుట్లు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ సాయంత్రం భక్తి సంగీత కచేరి, హరికథాగానం, కోలాటాలు నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.