NARAYANAVANAM ANNUAL FEST _ మే 11 నుండి 19వ తేదీ వరకు నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు
TIRUPATHI, 25 APRIL 2025: The annual Brahmotsavam in Sri Kalyana Venkateswara Swamy temple at Narayanavanam will be observed from May 11 to 19 with Ankurarpanam on May 10.
The important days includes Dhwajarohanam and Pedda Sesha Vahanam on May 11, Garuda Vahanam on May 15, Radhotsavam on May 18 and Kalyanotsavam on the same day evening.
Grihastas shall pay Rs. 1000 per ticket on which two persons will be allowed for Kalyanam.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మే 11 నుండి 19వ తేదీ వరకు నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2025 ఏప్రిల్ 25: నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు మే 11 నుండి 19వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 10న అంకురార్పణం నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ
11-05-2025
ఉదయం – ధ్వజారోహణం
రాత్రి – పెద్దశేష వాహనం
12-05-2025
ఉదయం – చిన్నశేష వాహనం
రాత్రి – హంస వాహనం
13-05-2025
ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం
14-05-2025
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సర్వభూపాల వాహనం
15-05-2025
ఉదయం – మోహినీ అవతారం
రాత్రి – గరుడ వాహనం
16-05-2025
ఉదయం – హనుమంత వాహనం
రాత్రి – గజ వాహనం
17-05-2025
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
18-05-2025
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వవాహనం, కల్యాణోత్సవం
19-05-2025
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం
బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజూ ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 18వ తేదీ రాత్రి 8.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రూ.1000/- చెల్లించి గృహస్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక వడ, కుంకుమ బహుమానంగా అందజేస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.