ANNUAL FETE IN SADUM _ మే 11 నుండి 19వ తేదీ వరకు బూరగమంద శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
TIRUPATI, 09 MAY 2022: The annual Brahmotsavam in Sri Prasanna Venkateswara Swamy temple at Sadum will be observed from May 11 to 19.
On May 20 Sayanotsavam will be observed.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD TIRUPATI
మే 11 నుండి 19వ తేదీ వరకు బూరగమంద శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2022 మే 09: టిటిడి పరిధిలోని సదుం మండలం బూరగమంద గ్రామంలో గల శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు మే 11 నుండి 19వ తేదీ వరకు జరుగనున్నాయి.
మే 11న రాత్రి 7 నుండి 10 గంటల వరకు అంకురార్పణ, ధ్వజారోహణం నిర్వహిస్తారు. మిగిలిన 8 రోజుల్లో ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 9 నుండి 10 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. మే 12న శేషవాహనం, మే 13న హంస వాహనం, మే 14న హనుమంత వాహనం, మే 15న రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు కల్యాణోత్సవం, రాత్రి 9.30 నుండి 10.30 గంటల వరకు గరుడ వాహనసేవ జరుగనుంది. మే 16న పుష్పపల్లకీ, మే 17న సింహ వాహనం, మే 18న అశ్వ వాహన సేవలు నిర్వహిస్తారు. మే 19న ఉదయం 9 నుండి 10 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 9 నుండి 10 గంటల వరకు గజ వాహనం, రాత్రి 10 నుండి 11 గంటల వరకు ధ్వజావరోహణం జరుగనుంది. మే 20వ తేదీన రాత్రి 7 నుండి 9 గంటల వరకు శయనోత్సవం నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.