ANNAMACHARYA 617TH JAYANTHI CELEBRATIONS FROM MAY 12 TO 18 _ మే 12 నుండి 18వ తేదీ వ‌ర‌కు తాళ్లపాక అన్నమాచార్యుల 617వ జయంతి ఉత్సవాలు

Tirupathi, 09 May 2025: The 617th birth anniversary celebrations of Saint Poet Sri Tallapaka Annamacharya will be held in a grand manner from May 12 to 18 by TTD.

The events will take place at his birthplace Tallapaka in the Dhyana Mandiram and at the 108-feet statue and also at Annamacharya Kalamandiram in Tirupati.

At Tallapaka:

On May 12, Srinivasa Kalyanam will be performed at 10:30 AM in front of the Dhyana Mandiram. From May 12 to 14, devotional music and dance programs will be held in the evenings from 6PM to 8 PM near the 108-feet statue of Annamacharya.

At Tirupati:

At Annamacharya Kalamandiram, literary seminars will be conducted from May 13 to 17 between 10:30 AM and 1 PM. From May 12 to 18, morning and evening cultural programs including music and dance performances by eminent artists will be held.

These events are  organized under the auspices of TTD’s Annamacharya Project, in celebration of the saint-poet’s immense contribution towards the devotional music and literature.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

మే 12 నుండి 18వ తేదీ వ‌ర‌కు తాళ్లపాక అన్నమాచార్యుల 617వ జయంతి ఉత్సవాలు

తిరుప‌తి, 2025 మే 09: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 617వ జయంతి ఉత్సవాలు మే 12 నుండి 18వ తేదీ వరకు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జ‌రుగ‌నున్నాయి.

ఇందులో భాగంగా మే 12వ తేదీన తాళ్ల‌పాక‌లోని ధ్యాన‌మందిరం వ‌ద్ద ఉద‌యం 10.30 గంట‌ల‌కు శ్రీనివాస‌ కల్యాణం నిర్వ‌హిస్తారు.

తాళ్లపాకలో..

మే 12 నుండి 14వ తేదీ వరకు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు తాళ్ల‌పాక‌లోని ధ్యాన‌మందిరం వ‌ద్ద, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద భక్తి సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు.

తిరుపతిలో..

తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో మే 13 నుండి 17వ తేదీ వరకు ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు సాహితీ సదస్సులు నిర్వ‌హిస్తారు. మే 12 నుండి 18వ తేదీ వ‌రకు ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో ప్రముఖ కళాకారులతో సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.