ND SV TEMPLE BTU FROM MAY 13-21 _ మే 13 నుండి 21వ తేదీ వరకు న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

TIRUPATI, 04 MAY 2022: The annual Brahmotsavams in TTD’s Sri Venkateswara temple at New Delhi will be observed between May 13 and 21 with Ankurarpanam on May 12.

 

On May 10, Koil Alwar Tirumanjanam will be performed.

 

The important days includes Dhwajarohanam on May 13, Garuda Seva on May 17, Radhotsavam on May 20 and Chakra Snanam on May 21.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మే 13 నుండి 21వ తేదీ వరకు న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2022 మే 04: న్యూఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే 13 నుంచి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జరుగనున్నాయి. మే 12న‌ సాయంత్రం అంకురార్పణం జ‌రుగ‌నుంది.

బ్రహ్మోత్సవాల ముందు మే 10వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం(ఆలయ శుద్ధి) నిర్వ‌హిస్తారు. మే 13వ తేదీ ఉదయం 8.30 నుండి 9 గంటల మ‌ధ్య మిథున‌ ల‌గ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, సాయంత్రం 7.30 నుండి 8.30 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. మే 22వ తేదీన సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

13-05-2022 ఉదయం – ధ్వజారోహణం, సాయంత్రం – పెద్ద‌శేష వాహనం.

14-05-2022 ఉదయం – చిన్న‌శేష వాహ‌నం, సాయంత్రం – హంస వాహనం.

15-05-2022 ఉదయం – సింహ వాహ‌నం, సాయంత్రం – ముత్య‌పుపందిరి వాహ‌నం.

16-05-2022 ఉదయం – క‌ల్ప‌వృక్ష వాహ‌నం, సాయంత్రం – స‌ర్వ‌భూపాల వాహనం.

17-05-2022 ఉదయం – మోహినీ అవ‌తారం, సాయంత్రం – క‌ల్యాణోత్స‌వం, గ‌రుడ వాహ‌నం.

18-05-2022 ఉదయం – హ‌నుమంత వాహ‌నం, సాయంత్రం – గజవాహనం.

19-05-2022 ఉదయం – సూర్య‌ప్ర‌భ వాహ‌నం, సాయంత్రం – చంద్ర‌ప్ర‌భ వాహ‌నం.

20-05-2022 ఉదయం – ర‌థోత్స‌వం, సాయంత్రం – అశ్వ వాహ‌నం.

21-05-2022 ఉదయం – చక్రస్నానం, సాయంత్రం – ధ్వజావరోహణం.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.