E-AUCTION OF MIXED RICE ON MAY 14 _ మే 14న మిక్సిడ్ రైస్ ఈ – వేలం
Tirupati, May 03, 2026: TTD will conduct an e-auction of rice offered by devotees through hundi at Tirumala and other associated temples on May 14.
A total of 16,338 kg of mixed rice will be auctioned in 41 lots, including 21 lots in the morning session and 20 lots in the afternoon.
Interested bidders are required to remit an EMD of ₹50,000 per session through the Konugolu portal on or before May 13 evening.
For further details, please contact the TTD Marketing Office, Tirupati, or visit: www.konugolu.ap.gov.in
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మే 14న మిక్సిడ్ రైస్ ఈ – వేలం
తిరుపతి, 2026 మే 03: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు హుండి ద్వారా సమర్పించిన బియ్యాన్ని మే 14న ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు.
మొత్తం 41 లాట్లుగా ఉన్న మిక్స్‌డ్ రైస్‌లో ఉదయం సెషన్‌లో 21 లాట్లు, మధ్యాహ్నం సెషన్‌లో 20 లాట్లు కలిపి సుమారు 16,338 కిలోల బియ్యాన్ని ఈ-వేలంలో ఉంచనున్నారు.
ఈ వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల వారు, ఉదయం మరియు మధ్యాహ్నం సెషన్‌లకు విడివిడిగా మే 13వ తేదీ సాయంత్రం లోపు ఆన్‌లైన్‌లో konugolu పోర్టల్ ద్వారా ప్రతి సెషన్‌కు రూ.50,000/- ఈఎండీ (EMD) చెల్లించాల్సి ఉంటుంది.
ఇతర వివరాల కోసం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని కార్యాలయ వేళల్లో సంప్రదించవచ్చు. ఫోన్: 0877-2264429. అలాగే టిటిడి వెబ్‌సైట్ www.konugolu.ap.gov.in సంప్రదించగలరు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.
