మే 14వ తేదీ నుండి శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు గుర్తింపు కార్డు తప్పనిసరి – టిటిడి
మే 14వ తేదీ నుండి శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు గుర్తింపు కార్డు తప్పనిసరి – టిటిడి
తిరుమల, 2010 మే 13: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, ఉత్సవములలో పాల్గొనదలచి, ముందుగా సేవా టిక్కెట్లను రిజర్వ్ చేసుకొన్న భక్తులు ఈనెల 14వ తేది నుండి వారికి సంబంధించిన ఏదేని గుర్తింపు కార్డును (ఐడెంటిటీ ఫ్రూప్) తప్పనిసరిగా సంబంధిత సేవకు హాజరయ్యేముందు చూపించవలసి వుంటుంది.
భక్తులు వారు రిజర్వు చేసుకొన్న సేవలు, ఉత్సవములలో పాల్గొనడానికి ముందుగా తిరుమలలోని వైంకుంఠం క్యూ కాంప్లెక్స్-1 నందు వారికి సంబంధించిన ఏదేని గుర్తింపు కార్డులను (ఐడెంటిటీ ఫ్రూప్) తితిదే అధికారులకు చూపించి ధృవీకరించుకోవలెను. లేనిచో వారు రిజర్వు చేసుకొన్న సేవలు, ఉత్సవములకు వారిని అనుమతించరు. విచక్షణ కోటా ద్వారా సేవాటికెట్లు పొందు వారు సైతం తప్పనిసరిగా వారికి సంబందించిన గుర్తింపుకార్డులను (ఐడెంటిటీ ఫ్రూప్) చూపించవలసి వుంటుంది.
భక్తులు ఈ మార్పును గమనించి తితిదేకి సహకరించవలసినదిగా మనవి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.