మే 15న తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవం

మే 15న తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవం
 
తిరుమల, 2022 మే 14: భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 292వ జయంతి ఉత్సవం ఆదివారం తిరుమలలో జరుగనుంది.
 
తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో ఆదివారం సాయంత్రం 4.30 గం.లకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనమునకు పుష్పాంజలి సమర్పిస్తారు. సా.5.30 గం.ల నుండి 6 గం.ల వరకు శ్రీవారు ఉభయనాంచారీ సమేతంగా తిరుమల మాడవీధుల ద్వారా నారాయణగిరి ఉద్యానవనముకు వేంచేపు చేస్తారు. సా.6 నుండి 7 గం.ల వరకు టిటిడి అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల బృందంచే  మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గోష్ఠీగానం, రా.7.గం.లకు విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర‌ సరస్వతి స్వామీజి, శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానంద సరస్వతి స్వామి వారి అనుగ్రహ భాషణం జరుగనుంది. 
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.