మే 16న తిరుమలలో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు

మే 16న తిరుమలలో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు

తిరుమల, మే 11, 2013: కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరుగా ప్రసిద్ధిగాంచిన శ్రీ త్యాగరాజస్వామి జయంతిని పురస్కరించుకుని మే 16వ తేదీన తిరుమలలో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా పాపవినాశనం మార్గంలోని కల్యాణవేదిక వద్ద ఉదయం 8.30 నుండి 11.00 గంటల వరకు ప్రముఖ వయొలిన్‌ విద్వాంసురాలు కుమారి కన్యాకుమారి ఆధ్వర్యంలో వంద మంది కళాకారులు ”పంచరత్నకృతులు” ఆలపించనున్నారు. సాయంత్రం శ్రీవారి ఆలయం ఎదురుగా గల నాదనీరాజనం వేదికపై శ్రీమతి కె.శేషులత, శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో గోష్టిగానం జరుగనుంది. ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ సంగీత కళాకారులు పాల్గొననున్నారు.
            
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.