ANNAMACHARYA JAYANTHI FROM MAY 16-22 _ మే 16 నుండి 22వ తేదీ వరకు అన్నమయ్య 614వ జయంతి ఉత్సవాలు
TIRUPATI, 14 MAY 2022: The 614th Jayanthi celebrations of Saint Poet Sri Tallapaka Annamacharya will be observed from May 16-22.
TTD will celebrate the fete at Tallapaka and Tirupati.
In Tirupati special programmes in this connection will be observed in Mahati Auditorium all these days.
While in Tallapaka, special programmes will be conducted at the 108feet statue of Annamacharya.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మే 16 నుండి 22వ తేదీ వరకు అన్నమయ్య 614వ జయంతి ఉత్సవాలు
తిరుపతి, 2022 మే 14: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 614వ జయంతి ఉత్సవాలు మే 16 నుండి 22వ తేదీ వరకు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరంలో జరుగనున్నాయి. ఇందులో భాగంగా మే 16 వ తేదీన తాళ్లపాకలోని ధ్యానమందిరం వద్ద ఉదయం 10 గంటలకు శ్రీవారి కల్యాణం నిర్వహిస్తారు.
తాళ్లపాకలో..
మే 16 నుండి 18వ తేదీ వరకు సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు తాళ్లపాకలోని ధ్యానమందిరం వద్ద, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తిరుపతిలో..
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మే 16 నుండి 22వ తేదీ వరకు ఉదయం 9 గంటలకు, రాత్రి 7 గంటలకు సంగీత కార్యక్రమాలు, సాయంత్రం 6 గంటలకు సాహితీ సదస్సు నిర్వహిస్తారు.
మహతి కళాక్షేత్రంలో మే 16 నుండి 22వ తేదీ వరకు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు ప్రముఖ విద్వాంసులు గాత్ర, వాద్య, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.