మే 16 నుండి 22వ తేదీ వరకు మహతి,అన్నమాచార్యకళామందిరంలో అన్నమయ్య 614వ జయంతి ఉత్సవాలు
మే 16 నుండి 22వ తేదీ వరకు మహతి,అన్నమాచార్యకళామందిరంలో అన్నమయ్య 614వ జయంతి ఉత్సవాలు
తిరుపతి, 2022 మే 15: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 614వ జయంతి ఉత్సవాలు మే 16 నుండి 22వ తేదీ వరకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా నిర్వహించనున్నారు.
మహతి కళాక్షేత్రంలో మే 16 నుండి 22వ తేదీ వరకు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు ప్రముఖ విద్వాంసులు గాత్ర, వాద్య, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సంగీత కచ్చేరీ లో బౌలి, శుద్ధధాన్యాసి, కన్నడ పావని, బెహగ్ లీడ్, యమన్ గాయత్రి, శంకరాభరణం, ధర్మావతి- పూర్ణిమ, కురంజి, రాగమాలిక,శృతిరంజని, బృందావని, హరిణి, మధ్యమావతి బృందాలు అద్భుతంగా అన్నమయ్య సంకీర్తనలు ఆలపిసిస్తారు.
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మే 16 నుండి 22వ తేదీ వరకు ఉదయం 9 గంటలకు, రాత్రి 7 గంటలకు సంగీత కార్యక్రమాలు, సాయంత్రం 6 గంటలకు సాహితీ సదస్సు నిర్వహిస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.