VASANTHOTSAVAMS IN SKVST _ మే 17 నుండి 19వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు

Tirupati, 14 May 2025: The annual Vasanthotsavams in Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram will be observed from May 17-19.

On May 18 there will be a procession of the Golden Chariot.

Every day Snapana Tirumanjanam is performed to the Utsava deities from 2pm to 4pm.

Owing to this festival, TTD has cancelled Arjita Kalyanotsavam during these three days.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

మే 17 నుండి 19వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు

– మే 18న స్వర్ణ రథోత్సవం

తిరుపతి, 2025 మే 14: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు మే 17 నుండి 19వ తేదీ వరకు జరుగనున్నాయి.

మే 18న సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు స్వర్ణ రథంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

ఉత్సవర్ల‌ను ఆలయంలోని వసంత మండపానికి వేంచేపు చేసి ప్రతి రోజు మ‌ధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్ సేవ, వీధి ఉత్సవం నిర్వహిస్తారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీ సీతాలక్ష్మణ ఆంజ‌నేయ‌స్వామి సమేత శ్రీరామచంద్రమూర్తి, శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపుగా తీసుకొచ్చి శాస్త్రోక్తంగా స్న‌ప‌న తిరుమంజ‌నం, ఆస్థానం నిర్వహిస్తారు.

వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామివారి దివ్యానుగ్రహం పొందడమే ఈ వసంతోత్సవం అంతరార్థం అని అర్చ‌కులు తెలిపారు.

ఈ సందర్భంగా మే 17 నుండి 19వ తేదీ వరకు ఆలయంలో కల్యాణోత్సవం ఆర్ధిత సేవను టిటిడి రద్దు చేసింది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.