మే 21 నుండి 24వ తేదీ వరకు శ్రీ కరియమాణిక్యస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ
మే 21 నుండి 24వ తేదీ వరకు శ్రీ కరియమాణిక్యస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ
తిరుపతి, మే 20, 2013: నగరిలోని శ్రీ కరియమాణిక్యస్వామివారి ఆలయ పునర్నిర్మాణ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు మే 21 నుండి 24వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి.
మే 21న ఉదయం ఆచార్యరుత్విక్‌వరణం, అకల్మష హోమం, అంకురార్పణ జరుగనున్నాయి. రాత్రి వాస్తుహోమం, యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మే 22న ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాల అనంతరం సాయంత్రం విగ్రహమూలస్థాపన జరగనుంది. రాత్రి విశేషహోమం నిర్వహించనున్నారు. మే 23న ఉదయం మహాశాంతి అభిషేకంతో ప్రారంభించి యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, ధ్వజస్తంభ స్థాపన, సాయంత్రం ధ్వజారోహణం, ఊంజల్‌సేవ, వీధి ఉత్సవం జరుగనున్నాయి. చివరి రోజైన మే 24వ తేదీన ఉదయం స్వామివారి వీధి ఉత్సవం, సాయంత్రం 4.30 గంటలకు స్వామివారి కల్యాణం, రాత్రి 9.00 గంటలకు ధ్వజావరోహణం నిర్వహించనున్నారు.
———————–
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో తితిదే పాఠశాలల ముందంజ
ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో తితిదే పాఠశాలలు ముందంజలో ఉన్నాయి. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాల 95.1 శాతం ఉత్తీర్ణత సాధించింది. మొత్తం 102 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 97 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే శ్రీ కపిలేశ్వరస్వామి ఉన్నత పాఠశాలలో 93.1 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 29 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 27 మంది ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఉన్నత పాఠశాలలో 92 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 76 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 70 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాల ఉపాధ్యాయులను, విద్యార్థులను తితిదే వి