మే 22 నుండి 31వ తేదీ వరకు జమ్మలమడుగు శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

మే 22 నుండి 31వ తేదీ వరకు జమ్మలమడుగు శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, మే 08, 2013: వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 22 నుండి 31వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 21వ తేదీన అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో మే 26వ తేదీన గరుడ సేవ, మే 27వ తేదీన కళ్యాణోత్సవం, మే 28వ తేదీన రథోత్సవం, మే 31వ తేదీన పుష్పయాగం జరుగనున్నాయి. రూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ సాయంత్రం 5.00 గంటల నుండి రాత్రి 7.00 గంటల వరకు భక్తి సంగీత కార్యక్రమం, రాత్రి 7.00 గంటల నుండి 9.00 గంటల వరకు హరికథాగానం,  కోలాటాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
                                           
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.