ANKURARPANAM FOR VASANTHOTSAVAMS _ మే 24న శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలకు అంకురార్పణ
Tirupati, 23 May 2021: The Ankurarpanam for annual Vasanthotsavams in Sri Padmavathi Ammavaru temple activation or will be held on May 24th evening.
The annual vasanthotsavam will take place between 25th to 27th of May in this Temple. In view of covid-19, today will be observing this feat in Ekantam.
Instead of Swarna Rathotsavam on May 26th, Tiruchi Utsavam will be observed. Every day there will be snapana tirumanam between 2:30 p.m. and 4:30 p.m. in the temple.
TTD has cancelled Kalyanotsavam and Unjal Seva on May 24th while Kalyanotsavam on all the three days during Vasanthotsavams.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మే 24న శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, 2021 మే 23: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు మే 25 నుండి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. మే 24వ తేదీ అంకురార్పణం నిర్వహిస్తారు. కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా వసంతోత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈ కారణంగా మే 26న స్వర్ణరథోత్సవానికి బదులుగా తిరుచ్చి ఉత్సవం జరుగనుంది.
ఈ మూడు రోజులపాటు మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆలయంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో అమ్మవారిని ఊరేగిస్తారు. ఈ కారణంగా మే 24న కల్యాణోత్సవం, ఊంజలసేవ, మే 25 నుండి 27వ తేదీ వరకు కల్యాణోత్సవం సేవలను టిటిడి రద్దు చేసింది.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.