మే 25 నుండి జూన్ 2వ తేది వరకు హృషికేశ్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవములు
పత్రికా ప్రకటన తిరుపతి, 2010 మే 17
మే 25 నుండి జూన్ 2వ తేది వరకు హృషికేశ్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవములు
తిరుపతి, 2010 మే 17: ఉత్తరఖండ్ రాష్ట్రంలోని హృషికేశ్నందు గల తితిదేకు చెందిన ఆంధ్రా ఆశ్రమంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు మే నెల 25వ తేది నుండి జూన్ నెల 2వ తేది వరకు వైభవంగా జరుగుతాయి. మే 24వ తేదిన అంకురార్పణ జరుగుతుంది.
ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారు ప్రతిరోజు ఈక్రింది వాహనాలను అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తారు.
తేది ఉదయం సాయంత్రం
25-05-2010 ధ్వజారోహణం (ఉ.8.40 గంటలకు) పెద్దశేష వాహనం
26-05-2010 చిన్నశేష వాహనం హంస వాహనం
27-05-2010 సింహ వాహనం ముత్యపు పందిరి వాహనం
28-05-2010 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
29-05-2010 పల్లకీ ఉత్సవం గరుడ సేవ
30-05-2010 హనుమంత వాహనం గజ వాహనం
31-05-2010 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
01-06-2010 రథోత్సవం (ఉ.7.20 గంటలకు) అశ్వ వాహనం
02-06-2010 చక్రస్నానము ధ్వజ అవరోహణం
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.