మే 25, 26వ తేదీల్లో మాతృ శ్రీతరిగొండ వెంగమాంబ 280వ జయంతి ఉత్సవాలు

మే 25, 26వ తేదీల్లో మాతృ శ్రీతరిగొండ వెంగమాంబ 280వ జయంతి ఉత్సవాలు

తిరుపతి, 2010 మే 20: మాతృ శ్రీతరిగొండ వెంగమాంబ 280వ జయంతి ఉత్సవాలు ఈ నెల 25,26వ తేదిలలో తిరుపతి, తిరుమలలో ఘనంగా నిర్వహిస్తారు.

వెంగమాంబ జయంతి సందర్భంగా శ్రీవారి ఆలయంలో సహస్రకళశాభిషేకం సేవను రద్దు చేశారు. శ్రీమలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలసి తిరుమలనారాయణగిరి  ఉద్యానవనంలోని పద్మావతి పరిణయోత్సవ మండపంలో జరుగు వెంగమాంబ జయంతి ఉత్సవాలలో పాల్గొంటారు. ఈ సందర్భంగా జరుగు గోష్టిగానం నందు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

వెంగమాంబ జయంతి ఉత్సవాల సందర్భంగా అన్నమాచార్యప్రాజెక్టు ఆధ్వర్యంలో నారాయణగిరి ఉద్యానవనంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.