మే 25, 27వ తేదీల్లో తమిళనాట శ్రీనివాస కల్యాణాలు
మే 25, 27వ తేదీల్లో తమిళనాట శ్రీనివాస కల్యాణాలు
తిరుపతి, మే 11, 2013: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా తితిదే శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రంలో రెండు చోట్ల శ్రీనివాస కల్యాణాలను వైభవంగా నిర్వహించనున్నారు.
శ్రీ మూగాంబిగ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో మే 25వ తేదీన తేనిలో, మే 27వ తేదీన ఉడమాలపేటలో స్వామివారి కల్యాణాలు వైభవంగా జరుగనున్నాయి. శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఓఎస్‌డి శ్రీ కె.రామకృష్ణ ఈ కల్యాణోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శ్రీవారి కళ్యాణోత్సవాల సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.