PUSHPA YAGAM IN KRT _ మే 3న శ్రీ కోదండ రామ‌స్వామివారి ఆల‌యంలో పుష్పయాగం

TIRUMALA, 23 APRIL 2025: The annual Pushpayagam will be held in Sri Kodanda Ramalayam in Tirupati on May 03 with Ankurarpanam on May 02.

Snapanam will be performed to deities in the morning, while Pushpayagam is from 4pm and 6pm.

The Grihastas can participate on payment of Rs. 1000 per ticket, on which two persons will be allowed.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

 

మే 3న శ్రీ కోదండ రామ‌స్వామివారి ఆల‌యంలో పుష్పయాగం

– మే 2న అంకురార్పణ

తిరుపతి, 2025 ఏప్రిల్ 23: తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో మే 3వ తేదీన పుష్పయాగం నిర్వ‌హించ‌నున్నారు. మే 2వ తేదీన సాయంత్రం పుష్పయాగానికి అంకురార్పణ జ‌రుగ‌నుంది.

మే 3న ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపన తిరుమంజనం నిర్వ‌హిస్తారు. అనంత‌రం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సీతా ల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ కోదండ‌రామ‌స్వామివారికి పలు రకాల పుష్పాలతో అభిషేకం చేస్తారు. అనంతరం రాత్రి 7 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌ను అనుగ్ర‌హిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.1,000/- చెల్లించి టికెట్‌ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చు.

శ్రీ కోదండరామాలయంలో మార్చి 27 నుండి ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.