BUGGA UTSAVAM AT SRI GOVINDARAJA SWAMY TEMPLE FROM MAY 9 TO 11 _ మే 9 నుండి 11వ‌ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుగ్గోత్సవం

TIRUPATI, 05 MAY 2025: The annual Bugga Utsavam will be celebrated at Tirupati’s Sri Govindaraja Swamy temple from May 9 to 11.

Each day at 2 PM, the processional deities of Sri Govindaraja Swamy along with Sri Devi and Bhu Devi will be brought to the Bugga Pushkarini in front of the temple. 

From 2:30 to 4:30 PM, Snapana Tirumanjanam and Ashtanam will be performed.

From 5:30 to 6 PM, a special Unjal Seva will be held with Ubhaya Nachiyars, followed by darshan to the devotees at Bugga. 

Later, from 6 PM to 6:30 PM, Ashtanam will be conducted at Sri Mahalakshmi temple.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

మే 9 నుండి 11వ‌ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుగ్గోత్సవం

తిరుమల, 2025 మే 05: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మే 9 నుండి 11వ తేదీ వ‌ర‌కు బుగ్గోత్సవం ఘనంగా నిర్వ‌హించ‌నున్నారు.

మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవంలో ప్ర‌తి రోజు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఆలయ మ‌హాద్వారానికి ఎదురుగా ఉన్న‌ బుగ్గ పుష్క‌రిణీ వద్దకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని వేంచేపు చేస్తారు. మ‌ధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సమర్పణ, ఆస్థానం నిర్వహించ‌నున్నారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఉభయనాంచారులతో కలసి స్వామివారి ఊంజలసేవ అనంతరం బుగ్గ వద్ద భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.

సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు శ్రీ మహలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద ఆస్థానం నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.