SPECIAL ABHISHEKAM HELD TO SRI LAKSHMI NARASIMHA SWAMY _ మొదటి ఘాట్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి వైభవంగా ప్రత్యేక అభిషేకం
మొదటి ఘాట్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి వైభవంగా ప్రత్యేక అభిషేకం
తిరుమల, 2024 నవంబరు 29: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని నడకమార్గం చెంత వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి శుక్రవారం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కార్తీక మాసంలో స్వాతి తిరు నక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో మూలమూర్తికి ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపులతో విశేషంగా అభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి పాల్గొని భక్తులకు స్వయంగా ప్రసాదాలు వితరణ చేశారు. అనంతరం అడిషనల్ ఈవోను శ్రీవారి ఆలయ పోటు పేష్కార్ శ్రీ మునిరత్నం సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.