MOHINI AVATAR ENTHUSES DEVOTEES _ మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు

Tirupati, 6 Mar. 21: Sri Kalyana Venkateswara as bewitching Mohini alankaram in Pallaki accompanied by Sri Krishna on Tiruchi enthralled the devotees on Saturday morning on the fifth day of ongoing annual Brahmotsavam at Srinivasa Mangapuram.

Mohini avatara is symbolic of Lord’s mystic powers to rule over evil with His mesmerising looks as Universal Damsel.

 ANDAL GARLANDS

 The divine Garlands from Goddess Andal temple of Sri Govindaraja Swamy were taken on a procession to Sri Kalyana Venkateswara temple for adorning the Garuda vahana on Saturday night.

Both senior and junior pontiffs of Tirumala, DyEO Smt Shanti, and AEO Sri Dhananjayulu were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు

తిరుపతి, 2021 మార్చి 06: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శ‌నివారం ఉదయం శ్రీ‌నివాసుడు మోహినీ అలంకారంలో, తిరుచ్చిపై కృష్ణుడు అభయమిచ్చారు.

మోహినీ అవతారం – మాయా మోహ నాశ‌నం

సకల లోక కల్యాణకారకుడు అయిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు దివ్యమోహినీ రూపంలో ఉత్సవమూర్తియై, తిరుచ్చిపై కృష్ణుడు భక్తులను తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు. ఆ దివ్య మోహినీ మాయాశక్తికి వశమైన జగత్తు వాహ్య వాహకభేదాన్ని గుర్తుంచుకోలేకపోయింది. కనుక శ్రీవారు జగన్మోహినియై పల్లకీలో కూర్చొని ఉంటారు. ఈనాటి శ్రీవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తుంది.

ఆండాళ్‌ అమ్మవారి మాలలు

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ‌నివారం రాత్రి జరుగనున్న గరుడ సేవలో అలంకరించేందుకు ఉదయం శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి ఆండాళ్‌ అమ్మవారి మాలలను తీసుకెళ్లారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మాలలకు పూజ‌లు చేసిన‌ అనంతరం అర్చకులు వాహ‌నంలో శ్రీ‌నివాసమంగాపురానికి తీసుకెళ్లారు. ఈ మాలలను శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్‌కు అలంకరించారు. రాత్రి జరిగే శ్రీవారి గరుడ సేవలో ఈ మాలలను స్వామివారికి అలంకరిస్తారు.

ఈ కార్యక్రమంలో  శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, శ్రీనివాసమంగాపురం ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి,  ఏఈవో శ్రీ ధ‌నంజ‌యులు, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.