MOHINI CASTS MAJIC _ మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి
Tirupati, 22 May 2021: On the fifth day morning, Sri Govindaraja Swamy decked as celestial damsel Mohini casted majic with His divine charm.
As a part of the ongoing annual brahmotsavams in Sri Govindaraja Swamy temple in Tirupati on Saturday, the Pallaki Utsavam.
Both the Senior and Junior Pontiffs of Tirumala, Special Grade Deputy EO Sri Rajendrudu and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి
తిరుపతి, 2021 మే 22: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన శనివారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారు పల్లకీపై మోహినీ అవతారంలో అభయమిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహనసేవ నిర్వహించారు.
సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించారు. అందులో హేయమైన విషంతోపాటు ఉపాదేయమైన అమృతం, ఎన్నో మేలి వస్తువులు ఉద్భవించాయి. వివిధ దేవతలు వాటిని స్వీకరించారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభించింది. దానిని పంచుకోవడంలో కలహం తప్పలేదు. ఆ కలహాన్ని నివారించి అసురులను వంచించి సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరించాడు. అసురులు సమ్మోహకమైన ఆమె క్రీగంటి చూపులకు పరవశులైపోయారు. తత్ఫలితంగా వారు వంచించబడడం, దేవతలు అనుగ్రహించబడడం జరిగింది.
అనంతరం ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.
కాగా, సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు గరుడవాహనంపై స్వామివారు దర్శనమిస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ రవికుమార్ రెడ్డి, కంకణ బట్టార్ శ్రీ ఏ.టి. పార్థసారధి దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ వెంకటాద్రి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ మునీంద్రబాబు, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.