KALYANA SRINIVASA CHARMS DEVOTEES IN MOHINI AVATAR _ మోహినీ మూర్తిగా భక్తులను మంత్రముగ్ధులను చేసిన కల్యాణ శ్రీనివాసుడు

GRAND PALLAKI PROCESSION AT NARAYANAVANAM

Tirupati, June 1, 2026: Sri Kalyana Venkateswara Swamy, along with Goddess Padmavati, appeared in the enchanting Mohini Alankaram during the annual Brahmotsavams at Narayanavanam on Monday morning.

The Lord was taken in a grand Pallaki procession through the temple streets at 8 a.m., blessing devotees. Bhajan groups, Kolatam performances, and traditional music added spiritual fervor to the event. Devotees offered harathis and had the divine darshan of the Lord.

The Mohini Avatar signifies Lord Mahavishnu distributing nectar to the Devas and overcoming illusion.

The much-awaited Garuda Vahana Seva will be held at 7 p.m. on Monday as part of the Brahmotsavams.

Temple Superintendent Sri Srinivasulu Reddy, Temple Inspector Sri Nagaraju, priests, and a large number of devotees participated in the event.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మోహినీ మూర్తిగా భక్తులను మంత్రముగ్ధులను చేసిన కల్యాణ శ్రీనివాసుడు

పల్లకిపై దివ్య విహారంభక్తులకు ఆధ్యాత్మిక పరవశం

రాత్రి గరుడవాహనంపై మహా వైభవ దర్శనం

తిరుపతి, 2026 జూన్ 01: నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో సోమవారం ఉదయం స్వామివారు మోహినీ అలంకారంలో పల్లకిపై దివ్యంగా విహరించి భక్తులకు కనువిందు చేశారు.

ఉదయం 8 గంటలకు గ్రామ వీధుల్లో విహరించిన స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ కటాక్షించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో గోవింద నామస్మరణ చేస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి పల్లకి సేవ అత్యంత వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని పులకించిపోయారు.

మోహినీ అవతార మహిమ

అసురులను మోహింపజేసి దేవతలకు అమృతాన్ని అందించేందుకు శ్రీమహావిష్ణువు మోహినీ అవతారాన్ని ధరించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. మోహినీ అలంకారంలో శ్రీనివాసుని దర్శించుకున్న భక్తులు మాయా బంధాలను అధిగమించి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలనే సందేశాన్ని ఈ అవతారం అందిస్తోంది.

రాత్రికి గరుడవాహన సేవ

బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడవాహన సేవ సోమవారం రాత్రి 7 గంటల నుండి జరగనుంది. గరుడునిపై కొలువుదీరే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.

ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నాగరాజు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.