FORWARD UNSCRIPTED ANCIENT KNOWLEDGE TO NEXT GENERATION- TTD EO _ మ్యాను స్క్రిప్ట్స్ లోని విజ్ఞానాన్ని నేటి తరానికి అందించాలి – టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి
Tirupati, 3 Apr. 22: TTD EO Dr KS Jawahar Reddy exhorted officials to ensure the transfer of all scientific knowledge embedded in age-old manuscripts for the betterment of future generations.
Addressing a review meeting on the Manuscripts Project on Sunday at Sri Padmavati Rest House in Tirupati, the TTD EO said the temporary office of the project should be housed in the old SVBC office and its staff deputed from various TTD departments besides an Executive set up and Advisory Committee.
He asked officials to scan, digitise and store all manuscripts available at the Sri Venkateswara University, Sri Venkateswara Vedic University etc.
Similarly, all the three significant ancient manuscripts lying with the State Government’s Archaeological unit of Kakinada and Rajahmundry also be scanned and digitised.
He also instructed officials to deliberate and co-ordinate with Telangana Government on the manuscripts of AP after the bifurcation of the united AP and procure them in digitised format.
TTD JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, Vice-chancellor of SV Vedic University Acharya Sudarshana Sharma, FA &CAO Sri Balaji, Chief Engineer Sri Nageswara Rao, OSD of SV Manuscripts Project Smt Vijayalakshmi, Sri Shashidhar, the Chairman and Trustee of Sanatana Jeevan Trust, Chirala were present and the National Sanskrit University VC Dr RK Thakur participated via virtual platform.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మ్యాను స్క్రిప్ట్స్ లోని విజ్ఞానాన్ని నేటి తరానికి అందించాలి- టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి
తిరుపతి 3 ఏప్రిల్ 2022: మ్యాను స్క్రిప్ట్ ( చేతిరాత)లో ఉన్న వేద, వైజ్ఞానిక తదితర అంశాలకు చెందిన గొప్ప విజ్ఞానాన్ని వెలికితీసి నేటి తరానికి అందించేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఆదివారం ఆయన మ్యాను స్క్రిప్ట్ ప్రాజెక్టుపై సమీక్ష జరిపారు . ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఎస్విబిసి పాత కార్యాలయంలో తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీ లోని వివిధ విభాగాల నుంచి సిబ్బందిని సమీకరించు కోవాలని సూచించారు. ప్రాజెక్టుకు పరిపాలన కమిటీ, సలహామండలి ఏర్పాటు చేయాలని చెప్పారు.
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ, సంస్కృత యూనివర్సిటీలోని మ్యాను స్క్రిప్ట్ లను స్కాన్, డిజిటైజ్ చేసి లాకర్లలో భద్ర పరచాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజమండ్రి , కాకినాడలో ఉన్న ఆర్కియాలజీ కార్యాలయాల్లోని మ్యాను స్క్రిప్ట్స్ ను కూడా స్కాన్, డిజిటైజ్ చేయాలన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన మ్యాను స్క్రిప్ట్స్ గురించి ఆ రాష్ట్ర అధికారులతో చర్చించి వాటిని తీసుకుని రావాలన్నారు.
జెఈఓలు శ్రీమతి సదాభార్గవి, శ్రీ వీరబ్రహ్మం, వేదిక్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య సుదర్శన శర్మ, ఎఫ్ఏ సిఎఓ శ్రీ బాలాజీ, చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వరరావు,
ఎస్వి మ్యాన్యుస్క్రిప్ట్ ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి శ్రీమతి విజయలక్ష్మి, చీరాల కు చెందిన సనాతన జీవన ట్రస్ట్ చైర్మన్ శ్రీ శశిధర్ సమావేశంలో పాల్గొన్నారు. సంస్కృత యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ ఆర్ కె ఠాకూర్ సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్నారు .
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదలచేయడమైనది