AKALA MRUTYUHARANA MAHA YAGNAM CONCLUDES AT SRI KT _ మహా పూర్ణాహూతితో ముగిసిన అకాల మృత్యుహరణ మహాయజ్ఞం
Tirupati, 20 Jan. 21: The 21 day Akala Mrutyuharana Maha Yagnam aimed at begetting health and prosperity of humanity underway at Sri Kapileswara Swamy Temple premises since December 30, concluded on Wednesday with Maha Purnahuti.
As part of the event, 51 Krishna Yajurveda Pundits from Tamilnadu and Karnataka performed Parayanams of Maha Mrutyunjaya Mantram daily for one lakh times. Along with Acharyas of SV Vedic University, they also observed japam, yagam and Tarpanams.
Puranic texts of Sri Rudra penned by Bhatta Bhaskara in Krishna Yajurveda and Shantikalpa says that all Mrityu Doshas will be removed with the performance of this yagam.
TTD EO Dr KS Jawahar Reddy, JEO Sri P Basanth Kumar, DyEO of Sri KT Sri Subramaniam, OSD of SVHVS Dr Akella Vibhishana Sharma, Superintendent Sri Bhupathi Raju and Temple Inspector Sri Reddy Sekhar were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
మహా పూర్ణాహూతితో ముగిసిన అకాల మృత్యుహరణ మహాయజ్ఞం
తిరుపతి, 2021 జనవరి 20: విశ్వంలోని సకలప్రాణి కోటికి మృత్యు భయం తొలగి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ తిరుపతి కపిలతీర్థం ప్రాంగణంలో జరుగుతున్న అకాల మృత్యుహరణ మహాయజ్ఞం బుధవారం ఉదయం మహా పూర్ణాహూతితో ముగిసింది. డిసెంబరు 30వ తేదీ నుండి ఈ మహాయజ్ఞం జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా వేద పండితులు ప్రతి రోజు శ్రీ మహామృత్యుంజయ మంత్రాన్ని లక్షసార్లు పఠించడం జరుగుతుంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 51 మంది కృష్ణయజుర్వేద పండితులు, ఎస్వీ వేద వర్సిటీ ఆచార్యులు యజ్ఞం, జపం, తర్పణం క్రతువులు నిర్వహించారు. కృష్ణ యజుర్వేదంలోని భట్టభాస్కరుడు రచించిన శ్రీరుద్రంలోను, శాంతికల్పం అనే గ్రంథంలోను ఇది ఉంది. ఈ యాగం వల్ల మృత్యుదోషాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్సెక్టర్ శ్రీ రెడ్డి శేఖర్ పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.