AWARENESS PROGRAM ON WOMEN’S SAFETY _ మహిళల భద్రతపై ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో అవగాహన కార్యక్రమం
Tirupati, 3 Mar. 22: Awareness programme on the safety of women was organised in TTD run SV Arts College by Women Protection Cell to the girl students on Thursday.
Speaking on the occasion, the Principal of the college Dr Narayanamma said the women students should make use of the Women Protection Cell when the need arises without any hesitation.
AVSO Smt Kalavati said the girl students shall bring their issues to the notice of Vigilance Wing which is always open at their service.
Crime Branch SI Smt Sumati said, the girls shall make use of She Teams on necessity.
Women Protection Cell Convenor Smt Vijaya sri and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
మహిళల భద్రతపై ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో అవగాహన కార్యక్రమం
తిరుపతి, 2022 మార్చి 03: టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో గురువారం కళాశాల ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఆధ్వర్యంలో మహిళల భద్రతపై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. నారాయణమ్మ మాట్లాడుతూ లక్ష్యసాధనలో విద్యార్థినులు వెనుకంజ వేయరాదని, భద్రతకు సంబంధించిన సమస్యలు ఎదురైతే ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు కళాశాల విద్యార్థినుల అభ్యున్నతికి సరికొత్త కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు తెలిపారు.
ముఖ్య అతిథులుగా విచ్చేసిన టిటిడి ఎవిఎస్వో శ్రీమతి కళావతి, క్రైమ్ బ్రాంచి ఎస్ఐ శ్రీమతి పి.సుమతి ప్రసంగించారు. టిటిడి ఎవిఎస్వో శ్రీమతి కళావతి మాట్లాడుతూ విద్యార్థినులు ఆత్మస్థైర్యంతో తమ సమస్యలను తెలియజేయాలని, విజిలెన్స్ విభాగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలియజేశారు.
క్రైమ్ బ్రాంచి ఎస్ఐ శ్రీమతి పి.సుమతి మాట్లాడుతూ కట్టుబాట్లను గౌరవిస్తే చట్టాల అవసరం ఉండదన్నారు. విద్యార్థినులు అవసరమైనపుడు షిటీమ్ సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కన్వీనర్ శ్రీమతి పి.విజయశ్రీ, ఇతర సభ్యులు, మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.