ANNAMAYYA KIRTAN TO BE MADE MORE ACCESSIBLE TO THE YOUTH – TTD EO _ యువతకు మరింతగా చేరువయ్యేలా అన్నమయ్య కీర్తనలు – టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు
Tirupati, 13 August 2025: TTD EO Sri J. Syamala Rao has instructed the officials concerned to take steps to make the poems of the great saint poet Sri Tallapaka Annamacharya more accessible to the youth.
He held a review with the concerned officials along with TTD JEO Sri Veerabraham in the Executive Officer Chamber in the TTD Administrative Building in Tirupati on Wednesday evening.
Speaking on the occasion, the EO suggested that competitions be organized on Annamayya Kirtans at the regional, district and state levels to involve the youth.
He said that in this way, Annamayya Kirtans can be taken to the masses. He also directed that steps should be taken to provide Annamayya kirtans to the new generation through a digital system in accordance with the changes in the technological field over time.
Hindu Dharmic Project Special Officer Sri Rajagopal, Annamacharya Project Director Dr. C. Latha, SV Recording Project Special Officer Dr Vibhishana Sharma were also present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
యువతకు మరింతగా చేరువయ్యేలా అన్నమయ్య కీర్తనలు – టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు
తిరుపతి, 2025, ఆగష్టు 13: పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య కీర్తనలను యువతకు మరింతగా చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని కార్యనిర్వాణాధికారి ఛాంబర్ లో టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మంతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, అన్నమయ్య కీర్తనలపై ప్రాంతీయ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించి యువతను భాగస్వామ్యం చేయాలని సూచించారు. తద్వారా అన్నమయ్య కీర్తనలను మరింతగా జనబాహుళ్యంలోకి తీసుకెళ్లవచ్చని తెలిపారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కీర్తిస్తూ వాగ్గేయ కారుడు అన్నమయ్య 14, 973 కీర్తనలను ఆలపించారని, ఇందులో 4,850 కీర్తనలను ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ రికార్డు చేసి 4,540 కీర్తనలను మాత్రమే అప్ లోడ్ చేశారని, మిగిలిన కీర్తనలను కూడా సకాలంలో రికార్డ్ చేసి భక్త ప్రపంచానికి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్నమయ్య కీర్తనలను మరింతగా యువతకు అందించి, ప్రాచుర్యంలోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ కు తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. టిటిడి నిబంధనల మేరకు నవతరం గాయకులతో అన్నమయ్య కీర్తనలను రికార్డ్ చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. కాలానుగుణంగా సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా డిజిటల్ వ్యవస్థ ద్వారా అన్నమయ్య కీర్తనలను నవతరానికి అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక్ ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి శ్రీ కె. రాజగోపాల్, అన్నమాచార్య ప్రాజెక్ట్ సంచాలకులు డా. సి. లత, ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి శ్రీ ఆకెళ్ల విభీషణ శర్మ పాల్గొన్నారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.


