“PROGRAMS SHOULD GUIDE YOUTH TOWARDS THE PATH OF DEVOTION” – TTD EO _ యువతను భక్తి మార్గం వైపు నడిపించేలా కార్యక్రమాలను రూపొందించాలి – టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు
Tirupati, 21 May 2025: TTD Executive Officer Sri J. Syamala Rao instructed officials to design SVBC programs that inspire the younger generation to walk the path of devotion and widely promote Sanatana Dharma.
He held a review meeting with SVBC officials on Wednesday at the EO’s chamber in the TTD administrative building in Tirupati.
On this occasion, the EO emphasized the need to create content that highlights the significance of Tirumala, Vaishnava traditions, greenery, Dasa literature, services offered by TTD to devotees, and the core principles of Sanatana Dharma.
He suggested showcasing summaries of TTD’s published books, inspirational stories, and promoting the tradition of Bhajans to the broader public.
EO stated that SVBC is currently producing programs in Telugu, Hindi, Tamil, and Kannada.
However, he directed the team to prepare and broadcast more innovative and creative content in all four languages.
The EO later emphasized the need for high-quality broadcasts and suggested evaluating the current programming to develop new shows that appeal to youth, middle-aged, and senior viewers alike.
He also recommended seeking expert advice in content development.
The EO instructed that promotional material related to Tirumala services, local temple rituals, and special programs should be aired in advance.
He further directed the officials to explore placement opportunities in Prasar Bharati vans and facilitate live telecasts of all four SVBC channels.
Additionally, he stressed the importance of utilizing SVBC’s YouTube and online radio platforms to provide timely information to devotees, including details of sevas, and devotional-cultural programs.
He also urged necessary upgrades for broadcasting all SVBC channels in HD quality.
TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary, JEO Sri Veerabrahmam, SVBC OSD Smt. K. Padmavati, and others were also present.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
యువతను భక్తి మార్గం వైపు నడిపించేలా కార్యక్రమాలను రూపొందించాలి – టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు
తిరుపతి, 2025, మే 21: నవతరాన్ని భక్తి మార్గం వైపు నడిపించేలా, సనాతన ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం కల్పించేలా ఎస్వీబీసీలో కార్యక్రమాలు రూపొందించాలని టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో బుధవారం ఎస్వీబీసీ అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల ప్రాముఖ్యత, వైష్ణవ సాంప్రదాయాలు, పచ్చదనం, దాససాహిత్యం, టిటిడి భక్తులకు అందిస్తున్న సేవలు, సనాతన ధర్మ మూలాలను పిల్లలకు తెలిపేలా, టిటిడి ప్రచురించిన ప్రముఖ పుస్తకాల సారాంశాన్ని, స్ఫూర్తిదాయక కథలను నవతరానికి తెలియజేసేలా, భజన సంప్రదాయాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలను రూపొందించాలని ఆయన సూచించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడం బాషలలో ఎస్వీబీసీ కార్యక్రమాలను రూపొందించి భక్తులకు అందిస్తోందని, నాలుగు భాషలలో వినూత్నంగా, సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. మరింత నాణ్యంగా ప్రసారాలు అందించాలన్నారు. ఇప్పటికే ప్రసారం అవుతున్న కార్యక్రమాలపై విశ్లేషణ చేసుకుని, యువతను, మధ్య వయస్కుల వారిని, వృద్ధులను ఆకట్టుకునేలా సరికొత్త కార్యక్రమాలను రూపొందించాలన్నారు. కార్యక్రమాల కల్పనలో నిపుణుల సలహాలను తీసుకోవాలని సూచించారు.
తిరుమల, స్థానిక ఆలయాలలో సేవలు, కైంకర్యాలు, ప్రత్యేక కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు ముందస్తుగా ప్రోమోలను ప్రసారం చేయాలన్నారు. ప్రసార భారతిలో వేన్స్ లో ప్లేస్ మెంట్ తీసుకుని నాలుగు ఛానళ్ల ప్రత్యక్ష కార్యక్రమాలను ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్వీబీసీ, యూట్యూబ్, ఆన్ లైన్ రేడియో ద్వారా భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారంతో పాటు స్వామి కైంకర్యాలు, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను అందించాలన్నారు. ఎస్వీబీసీ ఛానల్స్ లలో హెచ్.డి క్వాలిటీతో ప్రసారం చేసేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో వర్చువల్ గా అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, ఎస్వీబీసీ ఓఎస్ డి శ్రీమతి కె. పద్మావతి, ఎస్వీబీసీలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.