YOGA BRINGS GOOD HEALTH AND MENTAL PEACE: TTD JEO DR. A. SHARATH _ యోగతో శారీరక ఆరోగ్యం – మానసిక ప్రశాంతత : టిటిడి జేఈవో డా. ఎ. శరత్

Tirupati, June 17, 2026: TTD JEO Dr. A. Sharath said that practicing yoga daily helps improve physical health, mental peace, confidence, and inner strength.

He inspected the yoga training programme being conducted at SPW Degree College under the “Yoga–TTD Arogyananda” initiative on Wednesday.

The JEO said that a 15-day yoga training programme for TTD employees is being held from June 7 to 21 as per the directions of TTD EO Sri M. Ravichandra and in line with the vision of Prime Minister Sri Narendra Modi and Chief Minister Sri N. Chandrababu Naidu.

He wished the participants success in the yoga competitions scheduled on June 18, 19, and 20.

Senior TTD officials, faculty members, and staff attended the programme.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

యోగతో శారీరక ఆరోగ్యంమానసిక ప్రశాంతత : టిటిడి జేఈవో డా. . శరత్

తిరుపతి, 2026 జూన్ 17: ప్రతిరోజూ యోగాను దినచర్యలో భాగంగా చేసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంపొందుతాయని టిటిడి జేఈవో డా. ఎ. శరత్ తెలిపారు. “యోగ–టిటిడి ఆరోగ్యానంద” కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న యోగ శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా టిటిడి ఈవో శ్రీ ఎం. రవిచంద్ర ఆదేశాల మేరకు టిటిడి ఉద్యోగులకు ఈ నెల 7 నుండి 21వ తేదీ వరకు 15 రోజుల యోగ శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మనస్ఫూర్తిగా యోగాభ్యాసం చేస్తే ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా కుటుంబ జీవితంలో ఆనందం, సౌఖ్యం నెలకొంటాయని చెప్పారు. శిక్షణలో పాల్గొంటున్న ఉద్యోగులు ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే యోగ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి వెల్ఫేర్ డిప్యూటీ ఈవో శ్రీ ఆనందరావు, ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. నారాయణమ్మ, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

టిటిడి ప్రధాన ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది