‘రాజకీయ యాగంలో టిటిడి ప్రత్యేకాధికారి’ అనువార్త పూర్తిగా అవాస్తవం

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
వివరణ(తిరుపతి, అక్టోబర్‌-26, 2009)

 ‘రాజకీయ యాగంలో టిటిడి ప్రత్యేకాధికారి’ అనువార్త పూర్తిగా అవాస్తవం

అక్టోబర్‌ 26వ తేదిన వార్త దినపత్రిక నందు ప్రచురించిన ‘రాజకీయ యాగంలో టిటిడి ప్రత్యేకాధికారి’ అనువార్త పూర్తిగా అవాస్తవం అని తెలియజేస్తున్నాను.

అక్టోబర్‌ 25వ తేదిన సూపరిండింటెండ్‌ ఇంజనీరు శ్రీరామచంద్రారెడ్డి, ఇతర ఇంజనీరింగ్‌ సిబ్బందితో కలసి తితిదే ప్రత్యేకాధికారి శ్రీనివాసమంగాపురం నుండి కాలినడక దారిన భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా తిరుమలలోని వివిధ డ్యాముల నందు నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున శ్రీనివాసమంగాపురం మీదుగా తిరుమలకు నీటి పంపింగ్‌ విషయమై నీటి పైపులను వారు పరిశీలించడం జరిగింది.

ఈ క్రమంలో తితిదే పాలకమండలి సభ్యులు అదేదారిలో నిల్చొని వుండడం, వారిని పలకరించడానికి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి తిరిగిరావడం జరిగింది. అంతే తప్ప సదరు సభ్యులు నిర్వహించిన యాగంలో పాల్గొనడానికి కాదు అని స్పష్టం చేస్తున్నాను.

కనుక ఈ విషయాన్ని రేపటి మీ దినపత్రిక నందు వివరణగా ప్రచురించాల్సిందిగా కోరుచున్నాను.

ఏ.వి.ధర్మారెడ్డి
ప్రత్యేక అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు,తిరుపతి.