RAMAYANAM SHOWS RIGHT PATH OF LIFE _ రామాయణం సమాజానికి మార్గనిర్దేశనం : శ్రీ పి.ఆర్.ఆనంద తీర్థాచార్యులు
TIRUPATI, 09 APRIL 2022: The epic Ramayana has the power to guide one to lead a righteous path of life said, Dasa Sahitya Project Special Officer Sri Ananda Theerthacharyulu.
While the prize distribution ceremony held at Annamacharya Kalamandiram in Tirupati on Saturday to the students who prizes in Ramayana Shlokas, the official said, every character in Srimad Ramayanam taught us what is correct and not to lead a happy life. So it is good to by heart the shlokas of Ramayana from tender age itself he maintained.
Scholars Sr C Raghavan, Sri Dasaratha, Sri. Narasimhacharyulu, Sri Vadiraja Raghottama Rao, Sri Sesha Sai acted as judges for the shloka competition.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
రామాయణం సమాజానికి మార్గనిర్దేశనం : శ్రీ పి.ఆర్.ఆనంద తీర్థాచార్యులు
తిరుపతి, 2022 ఏప్రిల్ 09: సమాజాన్ని సన్మార్గంలో నడిపే శక్తి రామాయణానికి ఉందని టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్.ఆనందతీర్థాచార్యులు అన్నారు. టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో రామయణం శ్లోకాల కంఠస్తం విజేతలైన విద్యార్థులకు శనివారం మధ్యాహ్నం బహుమతుల ప్రదానోత్సవం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీ ఆనందతీర్థచార్యులు మాట్లాడుతూ మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు సమాజంలో ఎలా జీవించాలో రామాయణం తెలియజేస్తుందన్నారు. తల్లిదండ్రులు, గురు శిష్యులు, అన్నదమ్ములు, భార్య భర్తల మధ్య సంబంధాల గురించి వేలాది సంవత్సరాలుగా సమాజానికి మార్గనిర్దేశనం చేస్తోందని చెప్పారు. చిన్న వయస్సులోనే రామాయణ శ్లోకాలను శాస్త్రబద్ధంగా పఠించడం, దానిలోని సందేశం అర్థం చేసుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారన్నారు.
అంతకుముందు పదేళ్ళ లోపు విద్యార్థినీ, విద్యార్థులకు నామ రామాయణం అనే అంశం మీద పోటీలు నిర్వహించారు. 10 నుంచి 15 ఏళ్ళ లోపు వయసు గల విద్యార్థినీ, విద్యార్థులకు బాల రామాయణంలోని మెదటి సర్గలోని 96 శ్లోకాలపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో దాదాపు 125 మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. మొదటి విభాగంలో ప్రథమ స్థానంలో మేఘన, ద్వితీయ స్థానంలో మునికేశవ్, తృతీయ స్థానంలో శ్రీవాత్సవ నిలిచారు. రెండవ విభాగంలో ప్రథమ స్థానంలో హర్షిత రెడ్డి,ద్వితీయ స్థానంలో భువనశ్రీ, తృతీయ స్థానంలో నితియ విజేతలుగా నిలిచారు.
న్యాయ నిర్ణేతలుగా శ్రీ చక్రవర్తుల రాఘవన్, శ్రీ దశరథ, శ్రీ నరసింహా చార్యులు, శ్రీ శేషసాయి, శ్రీవాదిరాజ రఘోత్తమరావు లు వ్యవహరించారు
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.