STATE WIDE ARRANGEMENTS FOR KALYANAMASTU _ రాష్ట్ర‌వ్యాప్తంగా క‌ల్యాణ‌మ‌స్తుకు ఏర్పాట్లు ముమ్మ‌రం చేయాలి : టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం

TIRUPATI, 14 JUNE 2022: TTD JEO Sri Veerabrahmam directed officials to do arrangements in all district Head Quarters across the state for Kalyanamastu-free mass marriages which is scheduled on August 7.

 

A review meeting was held at TTD Administrative Building with all heads on Kalyanamastu on Tuesday evening.

 

Directing officials he reviewed in detail with the officials on how to make the program a grand success in coordination with district administration.

 

He also directed officials concerned to take the services of Srivari Sevaks, Dharma Prachara Mandalis of respective districts for the mega event.

 

CE Sri Nageswara Rao, Additional FACAO Sri Raviprasadu, GM IT and Transport Sri Sesha Reddy, Projects Program Officer Sri Vijayasaradhi and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

రాష్ట్ర‌వ్యాప్తంగా క‌ల్యాణ‌మ‌స్తుకు ఏర్పాట్లు ముమ్మ‌రం చేయాలి : టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం

తిరుపతి, 2022 జూన్ 14: క‌ల్యాణ‌మ‌స్తు సామూహిక ఉచిత వివాహాల కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు ముమ్మ‌రం చేయాల‌ని టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం సాయంత్రం వివిధ విభాగాల అధికారుల‌తో ఏర్పాట్ల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆగ‌స్టు 7న సుముహూర్తంలో జ‌రుగ‌నున్న క‌ల్యాణ‌మ‌స్తు కార్య‌క్ర‌మం కోసం ద‌ర‌ఖాస్తు ఫారాన్ని త్వ‌రిత‌గ‌తిన త‌యారుచేసి ఆయా జిల్లాల యంత్రాంగానికి అందించాల‌న్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు తిరుప‌తిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాల‌న్నారు. సామూహిక వివాహాలు ఘ‌నంగా నిర్వ‌హించేందుకు టిటిడి ప‌క్షాన‌, జిల్లా యంత్రాంగం ప‌క్షాన చేయాల్సిన ఏర్పాట్ల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. కార్య‌క్ర‌మం విజ‌య‌వంతానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై జిల్లా యంత్రాంగాల‌కు లేఖ‌లు రాయాల‌ని, వారితో స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మం గురించి గ్రామ‌స్థాయి వ‌రకు తెలిసేలా ప్ర‌చారం జ‌ర‌గాల‌ని, ఎక్కువ‌మందికి స‌మాచారం తెలిపేందుకు వీలుగా ఎస్వీబీసీ, ఇత‌ర ఛాన‌ళ్లు, సోష‌ల్ మీడియా, శ్రీ‌వారి సేవ‌కులు, ఇత‌ర వాలంటీర్ల స‌హ‌కారం తీసుకోవాల‌ని అన్నారు.

ఈ స‌మావేశంలో చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, అద‌న‌పు ఎఫ్ఏసిఏవో శ్రీ ర‌విప్ర‌సాదు, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీ విజ‌య‌సార‌థి, విజివో శ్రీ మ‌నోహ‌ర్ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.