TTD TO PROMOTE STATEWIDE PANCHAGAVYA COTTAGE INDUSTRY- TTD EO _ రాష్ట్ర వ్యాప్తంగా పంచగవ్య కుటీర పరిశ్రమలు

– DESI BREED COWS PROMOTION IN TTD GOSHALAS

– INDIGENOUS GHEE PRODUCTION FOR SRIVARI KAIKARYAS AND PRASADAM

Tirupati, 19 Mar. 22: TTD chairman Dr KS Jawahar Reddy said on Saturday that the action plan was ready to promote Panchagavya products as a cottage industry in Goshalas across Andhra Pradesh.

TTD EO said TTD all arrangements were being made to increase the desi breed of bovines in TTD Goshalas.

Speaking to media after inspection of the SV Goshala and the initiatives for Go Samrakshana and other development works the TTD EO said from May 1 of 2021, TTD has been preparing Srivari naivedyam with organic products without break with the support of donors.

Further TTD has decided to generate 60 kgs of desi ghee daily needed for Srivari kaikaryas and Prasadam. To achieve the task TTD board has decided to procure 500 desi breed cows with donors support.

Similarly, TTD decided to get 65 bovines of Kankrej, Sahiwal and Gir breed of cows from north India in coordination with the Director of extension and Vice-chancellor of SV Veterinary University in which 8 Gir breed cow and calf have already landed at SV Goshala. TTD is organising sheds to the upkeep of these animals.

INDIGENOUS GHEE PRODUCTION

TTD EO said to gather 500 desi breed animals to generate 3000 litres of milk daily to produce 60 kgs of ghee. With the support of some donors TTD aims to set up a ghee production Plant in the Goshala. Open, tender bids will be called and the selected bidder will be provided milk by TTD to produce 60 kgs of ghee, 4000 litres of buttermilk and curd on a daily basis. While ghee will be utilised for Swami kaikaryas, curd and buttermilk shall be used in the Anna Prasadam complex for the sake of pilgrims.

For the purpose of in house breeding of desi cows, a research lab has been set up within the SV Veterinary University through artificial insemination to breed high yielding. Five calf of Sahiwal breed have already successfully bred in this fashion, he added,

He said as part of agreeing with Rythu Sadhikara Samstha TTD has already donated 1100 cows and 600 bulls to farmers to promote organic farming who are successfully utilising cow urine and cow dung as manure and fertilisers in their fields.

He said TTD plans to collect 7000 tones of pulses from organic farmers and the process is already begun. TTD has also laid out a program for the development of Goshalas across AP with a nodal Goshala in certain districts through which Panchagavya, solid and liquid products are promoted.

TTD EO said TTD is also promoting a separate training institute at either Tirupati or Palamner to train Goshala operators with ISKCON assistance. A feed mixing plant is already on the anvil at Tirupati Goshala promoted by students of the Animal Husbandry University.

Additional EO Sri AV Dharma Reddy, Animal Husbandry University Vice-chancellor Sri Padmanabha Reddy, Director of Extension Sri Venkat Naidu, Goshala director Dr Harnath Reddy were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

రాష్ట్ర వ్యాప్తంగా పంచగవ్య కుటీర పరిశ్రమలు

– టిటిడి గోశాలలో పాల దిగుబడి పెంచే దేశవాళి
గో జాతుల అభివృద్ధికి శ్రీకారం

– స్వామివారి కైంకర్యాలు, ప్రసాదాల తయారీకి సొంతంగా నెయ్యి తయారు

టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి

తిరుపతి 19 మార్చి 20 22: రాష్ట్రంలోని గోశాలలను పంచగవ్య ఉత్పత్తుల కుటీర పరిశ్రమ కేంద్రాలుగా రూపొందించడానికి కార్యాచరణ తయారు చేశామని టీటీడీ ఈవో డాక్టర్
కె ఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. టీటీడీ గోశాలలో అధిక పాల దిగుబడినిచ్చే దేశవాళి గో జాతుల సంతతిని పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు.

శనివారం శ్రీ వేంకటేశ్వర గో శాలను ఆయన సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి పనులను, గో సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీవారికి గత ఏడాది మే 1వ తేదీనుంచి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంట ఉత్పత్తులతో నైవేద్యం సమర్పించడం ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమం దాతల సహకారంతో నిర్విఘ్నంగా కొనసాగుతోందన్నారు. దీనికి కొనసాగింపుగా గో సంరక్షణ , గో ఆధారిత వ్యవసాయం, గోశాలల అభివృద్ధి లాంటి ఆలోచనలు జరిగాయన్నారు. శ్రీవారికి కైంకర్యాలు, ప్రసాదాల తయారీకి రోజు 60 కిలోల నెయ్యి అవసరమవుతోందన్నారు. దీన్ని దేశవాళి ఆవు పాల ద్వారా సొంతంగా తయారు చేయడానికి నిర్ణయించామన్నారు. ఇందుకోసం దాతల సహకారంతో ఎస్ వి గోశాలకు 500 దేశవాళి పాలిచ్చే ఆవులను కొనుగోలు చేయాలని పాలకమండలి నిర్ణయం తీసుకుందన్నారు.

శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ సహకారంతో ఉత్తర భారతదేశం నుంచి కాంక్రీజ్, సాహివాల్, గిర్ జాతులకు చెందిన 65 ఆవులను తేవడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇందులో గిర్ జాతికి చెందిన 8 ఆవులు, దూడలు ఇప్పటికే గోశాలకు చేరుకున్నాయని వివరించారు. ఆవుల కోసం గోశాలలోని షెడ్లలో కొన్ని మార్పులు చేస్తున్నామని తెలిపారు. ఆవులు పాలిచ్చే సమయం లో మాత్రమే షెడ్ లోకి వచ్చి మిగిలిన సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి ఇసుక తిన్నెలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

సొంతంగా నెయ్యి తయారీ

గోశాలలో 500 గోవులు ఏర్పాటు చేసి రోజుకు 60 కిలోల నెయ్యి తయారీకి అవసరమయ్యే 3 వేల లీటర్ల పాలను సేకరిస్తామని ఆయన తెలిపారు. నెయ్యి తయారీ కోసం దాతల సహకారంతో గోశాలలో ఒక ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నెయ్యి తయారీ కోసం టెండర్లు పిలిచి ఎంపికైన వారికి టిటిడి పాలు అందిస్తుందని, ఇందులోంచి 60 కిలోల నెయ్యి, 4 వేల లీటర్ల మజ్జిగ, కొంత పెరుగుకూడా వస్తుందని డాక్టర్ జవహర్ రెడ్డి చెప్పారు. నెయ్యిని స్వామివారి కైంకర్యాలు, ప్రసాదాల తయారీకి, మజ్జిగ, పెరుగు అన్నదానం కాంప్లెక్స్ లో ఉపయోగిస్తామన్నారు.

దేశవాళి పశువుల్లో పాల ఉత్పత్తి పెంచే మేలుజాతి రకం ఆవులు పుట్టించడానికి
శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం గైనకాలజీ విభాగంలో ప్రత్యేక టెక్నాలజీతో పరిశోధనా శాల ఏర్పాటు చేశామన్నారు. జన్యు పరిశోధనల ద్వారా మేలు జాతి రకం పిండోత్పత్తి చేసి దూడలు పుట్టించే ఏర్పాటు జరుగుతోందన్నారు.ఇందులో భాగంగా సాహివాల్ జాతికి చెందిన ఐదు దూడలు ఇప్పటికే పుట్టాయనని ఆయన చెప్పారు.

గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం రైతు సాధికార సంస్థ తో చేసుకున్న ఒప్పందం మేరకు పాలివ్వని 1100 ఆవులు, 600 ఎద్దులను రైతులకు ఉచితంగా ఇచ్చామన్నారు. గోమూత్రం, గోమయంతో రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల నుంచి ఏడాదికి 7వేల టన్నుల సెనగలు సేకరించాలని నిర్ణయించామన్నారు. ఈ సేకరణ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలోని గోశాలల అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని, ఇందుకోసం ప్రతి జిల్లాలో నోడల్ గోశాలలను ఏర్పాటు చేశామని తెలిపారు. వీటి ద్వారా పంచగవ్య, ఘన, ద్రవ జీవామృతం తయారు చేస్తారన్నారు. గోశాలల నిర్వాహకులకు ఇస్కాన్ సంస్థ శిక్షణ ఇవ్వడం కోసం తిరుపతి లేదా పలమనేరులో ఒక సంస్థను ఏర్పాటు చేస్తుందన్నారు. తిరుపతి గోశాల లోని పశువుల కోసం ఇక్కడే ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని, పశువైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులు దీన్ని నిర్వహిస్తారని ఈవో చెప్పారు.

అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, జె ఈవో శ్రీ వీరబ్రహ్మం, సి వి ఎస్ ఓ శ్రీ గోపీనాథ్ జెట్టి, పశువైద్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీ పద్మనాభ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ శ్రీ నాయుడు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది