SRI SUNDARAJA SWAMY GRACES DEVOTEES ON FLOAT FESTIVAL – DAY TWO _ రెండవ రోజు తెప్పపై విహరించిన శ్రీసుందరరాజ స్వామి
Tirupati, June 26, 2026: As part of the annual Float Festival of Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor, Sri Sundararaja Swamy blessed devotees by taking three rounds on the float in the Padma Sarovaram on Friday.
Special rituals, including Suprabhatham, Sahasranamarchana, Nityarchana, and Abhishekam with milk, curd, honey, sandalwood, and fragrant substances, were performed. In the evening, the float festival was held ceremoniously, followed by the deity’s procession through the four Mada Streets.
JEO Dr. A. Sharath, Deputy EO Sri Harindranath, AVSO Sri Radhakrishna, Superintendents Sri Suresh and Sri Ramesh, Temple Inspector Sri Chalapathi, officials, priests, Srivari Sevaks, and a large number of devotees participated in the event.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
రెండవ రోజు తెప్పపై విహరించిన శ్రీ సుందరరాజ స్వామి
తిరుపతి, 2026 జూన్ 26: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శుక్రవారం పద్మసరోవరంలో శ్రీ సుందరరాజ స్వామివారు తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించారు.
ఉదయం సుప్రభాతం, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకం జరిపారు.
సాయంత్రం ఉత్సవమూర్తులను పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేసి, తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ సుందరరాజ స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
ఈ కార్యక్రమంలో జేఈవో డా.ఎ. శరత్, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఏవీఎస్వో శ్రీ రాధాకృష్ణ, సూపరింటెండెంట్ లు శ్రీ సురేష్, శ్రీ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ చలపతి, ఇతర అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.







