RENIGUNTA AIRPORT TO BE NAMED AS SRI VENKATESWARA INTERNATIONAL AIRPORT – TTD CHAIRMAN _ రేణిగుంట విమానాశ్ర‌యానికి శ్రీ‌వేంక‌టేశ్వ‌ర అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంగా పేరు మార్చేందుకు కేంద్రానికి సిఫార్సు – టీటీడీ చైర్మ‌న్ శ్రీ బీ.ఆర్‌.నాయుడు

Tirumala, 17 June 2025:The Renigunta Airport in Tirupati has been recommended to Central Civil Aviation to be renamed as Sri Venkateswara International Airport, and the Airport will be re-designed in such a way replicating Tirumala aesthetics, bringing spiritual beauty, asserted TTD Chairman Sri BR Naidu.

Addressing a media conference in his camp office at Tirumala on Tuesday evening, the TTD Board Chief briefed the decisions taken by the Trust Board during the meeting held at Annamaiah Bhavan earlier.

Some excerpts:

 -During his recent visit to Bengaluru (for attending Srinivasa Kalyanam) the TTD Chairman has formally met the Honourable CM of Karnataka Sri Siddharamaiah and the Deputy CM Sri Siva Kumar.

It was decided to build a Srivari temple in the prime location at Bengaluru as soon as the Karnataka government allocates the required land to TTD.

 – Union Heavy Industries Minister Sri Kumara Swamy came forward to allocate 100 electric buses to TTD from the Central Government and steps are being taken to bring the buses to Tirumala soon.

 – Decision to allot some space by TTD on lease basis to CSIR Lab to be set up by Central Government in Tirupati.  Thus, the quality of ghee, water and food items used can be verified for free.

 – Decision to modernize the 73-year old prestigious TTD-run SV College at New Delhi.

Sought APPSC to stall the recruitment of lecturer posts in TTD.  To solve the problem of 200 contract lecturers who are already working from the past two decades, a three-member committee has been set up as per the instructions of the Honourable Chief Minister of AP Sri Chandrababu Naidu comprising TTD Chairman, EO and AP Minister for Endowments to sort out the issue.

Later the Chairman also elaborated on the various Dharmic programmes under pipeline by HDPP as a part of spreading Hindu Sanatana Dharma in a big way

Highlights:

 – It is proposed to conduct training programs on various Vratams and Pooja procedures in addition to the existing training program in SVETA for the persons hailing from backward and fishermen communities in Priesthood.

To train the students of TTD run schools in imparting ethical values ​ ​ and personality development through a unique program called ‘Sadgamaya’

 -An exclusive program for the women by name ‘Saubhagyam’ to be observed in both the Telugu states on the auspicious day of Varalakshmi Vratam on August 08. 

 –  ‘Akshara Govindam’ is an Akshrabhyasa samskaram which is a part of teaching literacy practices as mentioned in Hindu Sanatana Dharma to children from a tender age by providing a kit with the blessings of Sri Venkateswara. 

Besides, programs like ‘Harikatha Vaibhavam’ for sustaining the legacy of Harikatha Parayanam, ‘Bhagavad Gita Anushtana Bodhana’ to provide insight to youth to withstand the challenges that come up in day to day life, a training programme in Telugu, Tamil and Kannada Bhajans through ‘Bhaje Srinivasam’, unique plantation program through ‘Vana-Nidhi’, Srinivasa Kalyanams and other spiritual programs in Tribal areas through ‘Giri Janardhanam’, inculcating the ethical values to lead a righteous path of life among prisoners through ”Sanmargam” have also been contemplated.

TTD board members Sri. Jyotula Nehru, Smt. Panabaka Lakshmi, Smt  Janaki Devi, Sri. Naresh, Sri Sadashiva Rao, Sri. Santaram, Sri. Ramamurthy, Sri. Diwakar Reddy were also present.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

రేణిగుంట విమానాశ్ర‌యానికి శ్రీ‌వేంక‌టేశ్వ‌ర అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంగా పేరు మార్చేందుకు కేంద్రానికి సిఫార్సు – టీటీడీ చైర్మ‌న్ శ్రీ బీ.ఆర్‌.నాయుడు

తిరుమ‌ల‌, 2025 జూన్ 17: తిరుప‌తిలోని రేణిగుంట విమానాశ్ర‌యానికి శ్రీ‌వేంక‌టేశ్వ‌ర అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంగా పేరు మార్చ‌డంతో పాటు, తిరుమ‌ల‌కు ఐకానిక్ గా విమానాశ్ర‌యానికి ఆధ్యాత్మిక శోభ‌ను తీసుకొచ్చేందుకు కేంద్ర విమాన‌యానశాఖ‌కు సిఫార్సు చేయ‌నున్న‌ట్లు టీటీడీ చైర్మ‌న్ శ్రీ బీ.ఆర్.నాయుడు తెలియ‌జేశారు. తిరుమ‌ల‌లోని టీటీడీ చైర్మ‌న్ క్యాంపు కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం టీటీడీ ధ‌ర్మ క‌ర్త‌ల మండ‌లిలో తీసుకున్న నిర్ణ‌యాలను ఆయ‌న మీడియాకు వెల్ల‌డించారు.

స‌మావేశంలోని ముఖ్యాంశాలు

•⁠ ⁠ఇటీవ‌ల క‌ర్ణాట‌క సీఎం, డిప్యూటీ సీఎంల‌ను క‌లిసిన సంద‌ర్భంగా వారి అభ్య‌ర్థ‌న మేర‌కు బెంగుళూరులోని ప్ర‌ధాన ప్రాంతంలో శ్రీ‌వారి ఆల‌యం నిర్మించాల‌ని నిర్ణ‌యం. ఇందుకు కావాల్సిన 47 ఎక‌రాల స్థ‌లాన్ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కేటాయించ‌గానే ఆల‌యం నిర్మించేందుకు చ‌ర్య‌లు.

•⁠ ⁠కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ హెచ్‌.డీ.కుమార స్వామి కేంద్ర ప్ర‌భుత్వం నుండి టీటీడీకి 100 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు కేటాయించేందుకు ముందుకు రావ‌డంతో త్వ‌ర‌లోనే బ‌స్సులను తిరుమ‌ల‌కు తీసుకొచ్చేందుకు చర్య‌లు.

•⁠ ⁠కేంద్ర ప్ర‌భుత్వం తిరుప‌తిలో ఏర్పాటు చేయ‌నున్న సీఎస్ఐఆర్ ల్యాబ్ కు లీజు ప‌ద్ధ‌తిలో టీటీడీ స్థ‌లాన్ని కేటాయించాల‌ని నిర్ణ‌యం. త‌ద్వారా టీటీడీ వినియోగించే నెయ్యి, నీరు, ఆహార ప‌దార్థాల నాణ్య‌త‌ను ఉచితంగా త‌నిఖీ చేసేందుకు అవ‌కాశం.

•⁠ ⁠న్యూఢిల్లీలోని ప్ర‌తిష్టాత్మ‌క టీటీడీ క‌ళాశాల‌ను ఆధునీక‌రించాల‌ని నిర్ణ‌యం.

•⁠ ⁠టీటీడీలోని లెక్చ‌ర‌ర్ పోస్టుల భ‌ర్తీని నిలిపివేయాల‌ని ఏపీపీఎస్సీకి సిఫార్సు. ఇప్ప‌టికే ప‌ని చేస్తున్న 200 మంది కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్ల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు త్రిస‌భ్య క‌మిటీ ఏర్పాటు.

•⁠ ⁠సమరసతా సేవా ఫౌండేషన్ సహకారంతో ప్రస్తుతం నిర్వహిస్తున్న అర్చకుల శిక్షణా కార్యక్రమంతో పాటు వివిధ వ్రతాలు, పూజా విధానాలలో కూడా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం.

•⁠ ⁠విద్యార్థుల్లో హైందవ సనాతన ధర్మం నేర్పిన మానవీయ విలువలను, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల్లో శిక్షణ ఇవ్వడానికి సద్గమయ కార్యక్రమాన్ని టీటీడీకి చెందిన ఏడు పాఠశాలల్లోని దాదాపు 1600 మంది విద్యార్థులకు డే స్కాలర్ విధానంలో శిక్షణ.

•⁠ ⁠టీటీడీ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు హిందూ సనాతన ధార్మిక విలువలతో పాటు తెలుగు సాంస్కృతిక వైభవంలో శిక్షణ ఇవ్వడంలో భాగంగా మన వారసత్వం అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయం.

•⁠ ⁠వరలక్ష్మీ వ్రతం పర్వదినాన తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో సౌభాగ్యం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం.

•⁠ ⁠అదేవిధంగా అక్షర గోవిందం, హరికథా వైభవం, భగవద్గీత అనుష్టాన బోధన, భజే శ్రీనివాసం, వన-నిధి, గిరి జనార్దనం, సన్మార్గం వంటి కార్యక్రమాలను నిర్వహించి జన బాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు చర్యలు.
•⁠ ⁠జూన్ 21 న యోగ దినోత్సవం సందర్భంగా టీటీడీ పరిపాలన భవనం గ్రౌండ్ నందు కార్యక్రమం.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీమతి తమ్మిశెట్టి జానకీ దేవి, శ్రీ నరేష్, శ్రీ సదాశివరావు, శ్రీ శాంతా రామ్, శ్రీ రామ్మూర్తి, శ్రీ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.