రేపు శ్రీ కపిలేశ్వర ఆలయంలో లక్షబిల్వార్చన

రేపు శ్రీ కపిలేశ్వర ఆలయంలో లక్షబిల్వార్చన

తిరుపతి, 2010 నవంబర్‌-23: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి ఆలయంలో బుధవారం (నవంబర్‌ 24)  నాడు ఆర్జిత లక్షబిల్వార్చన సేవా  కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి యేట కార్తీక మాసంలో ఆరుద్రా నక్షత్రం పర్వదినాన ఈ సేవను ఆలయ అర్చకులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సవమూర్తులకు నిర్వహించడం ఆనవాయితి. ఈ కార్యక్రమం ఉదయం 6గం||ల నుండి మధ్యాహ్నం 1గం|| వరకు ఊంజల మండపంలో నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన భక్తులు రూ.100 చెల్లించాలి. ఒక టిక్కెట్టు పై ఇద్దరు భక్తులను సేవకు అనుమతిస్తారు.    

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.