SHODASAHA SUNDARAKANDA DIKSHA BEGINS _ లోక‌సంక్షేమం కోసం షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష

Tirumala, 3 May 2021: The TTD spiritual endeavour to out-beat the pandemic Corona, Shodasha Dina Sundarakanda Diksha parayanams commenced as per Agama traditions at Vasantha mandapam at Tirumala on Monday morning and will continue till May 18.

As per the Shodashakshari Maha Mantram, the first-day parayanams on the first keyword ‘‘ Raa ‘ comprising of 269 shlokas (211 of first sarga and 58 of second sarga) were chanted by Vedic pundits. It was followed by parayanams of Bala Ramayana and the Visuchika Maha-mantra of the Yoga Shaista which included Sri Rama Prarthana, Sri Anjaneya Prarthana and Sri Valmiki Prarthana.

There after 16 upasakas performed Shloka parayanams.  On Tuesday 152 shlokas of 3-6 sargas of Sundara Kanda parayanams will be conducted 

Speaking on the occasion Principal of Dharmagiri Veda Pathashala Acharya KSS Avadhani said the TTD was performing the Shodasha Dina Sundarakanda Diksha for well being of humanity with blessings of Sri Sita Sameta Sri Ramachandra and Sri Anjaneya.

He said besides the Shloka Parayanams at Vasantha Mandapam, 16 Vedic Upasakas would daily observe Japam and Homa programs for 16 days at the Dharmagiri Veda Pathashala.

He said in the unique Diksha each day parayanams were based on the first word in a shloka as it had a specific meaning which heralded the Maha-mantra for universal well-being.

For the benefit of Srivari devotees across the world the program is live telecast by the SVBC every morning at 08.30 am.

TTD health officer Dr RR Reddy, SV Institute of higher Vedic studies OSD Dr Akella Vibhishana Sharma were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

లోక‌సంక్షేమం కోసం షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష

– వ‌సంత మండ‌పంలో 16 రోజుల పాటు పారాయ‌ణం

తిరుమల, 2021 మే 03: లోక సంక్షేమం కోసం, క‌రోనా వ్యాధిని అరిక‌ట్టాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష‌ను తిరుమ‌ల‌లోని వ‌సంత మండ‌పంలో సోమ‌వారం ఉద‌యం శాస్త్రోక్తంగా ప్రారంభ‌మైంది. ఈ దీక్ష మే 18వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నుంది.

షోడ‌షాక్ష‌రి మ‌హామంత్రం ప్ర‌కారం మొద‌టి రోజు రా అనే అక్ష‌రానికి ఉన్న బీజాక్ష‌రాల ప్ర‌కారం సుంద‌ర‌కాండ‌లోని మొద‌టి స‌ర్గ‌లో 211, రెండో స‌ర్గ‌లో 58 క‌లిపి మొత్తం 269 శ్లోకాల‌ను పారాయ‌ణం చేశారు. అదేవిధంగా బాల‌రామాయ‌ణం, యోగ‌వాశిష్ఠంలోని విషూచిక మ‌హామంత్ర పారాయ‌ణం చేశారు. ఇందులో భాగంగా మొద‌ట సంక‌ల్పంతో ప్రారంభించి శ్రీ‌రామ ప్రార్థ‌న‌, శ్రీ ఆంజ‌నేయ ప్రార్థ‌న‌, శ్రీ వాల్మీకి ప్రార్థ‌న చేశారు. ఆ త‌రువాత 16 మంది ఉపాస‌కులు శ్లోక పారాయ‌ణం చేశారు. మంగ‌ళ‌వారం నాడు మూడో స‌ర్గ నుండి ఆరో స‌ర్గ వ‌రకు మొత్తం 152 శ్లోకాల‌ను పారాయ‌ణం చేయ‌నున్నారు.

ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల ప్రిన్సిపాల్ ఆచార్య కుప్పా శివ‌సుబ్ర‌హ్మ‌ణ్య అవ‌ధాని మాట్లాడుతూ సీతా స‌మేతుడైన శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి, ఆంజ‌నేయ‌స్వామివారి అ‌నుగ్ర‌హంతో ప్ర‌పంచంలోని మాన‌వులు ధ‌ర్మాని ఆచ‌రిస్తూ, స‌క‌‌ల శుభాల‌ను పొందాల‌ని ఆకాంక్షిస్తూ షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష కార్య‌క్ర‌మాన్ని టిటిడి నిర్వ‌హిస్తోంద‌న్నారు. వ‌సంత మండ‌పంలో శ్లోక పారాయ‌ణంతోపాటు ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో మ‌రో 16 మంది ఉపాస‌కులు 16 రోజుల పాటు జ‌ప‌, హోమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తార‌ని వివ‌రించారు.

శ్రీ‌వారి స‌న్నిధిలోని వ‌సంత మండ‌పంలో షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష చాలా విశిష్ట‌మైనది. ” రాఘవస్య పద ద్వంద్వం దద్యాదమిత వైభవమ్‌ ” అనే వాక్యాన్ని అనుస‌రించి సీతాప‌తి అయిన శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి విజ‌యాన్ని ఇచ్చుగాక అనే అర్థం క‌లిగివుంటుంది. ఈ వాక్యంకు సంబంధించిన కావున ఇందులోని నియ‌మాల ప్ర‌కారం క‌ట‌ప‌యాది సంఖ్య‌లు ప‌రిగ‌ణ‌లోనికి తీసుకుంటే ఒక్కొక్క అక్ష‌రానికి విలువ‌ను లెక్కించి, అందుకు అనుగుణంగా ఆయా రోజుల‌లో అన్ని స‌ర్గ‌లు పారాయ‌ణం చేయ‌నున్నారు. ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల కోసం ప్ర‌తిరోజూ ఉద‌యం 8.30 గంట‌ల నుండి ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆరోగ్య‌శాఖాధికారి డా.ఆర్ఆర్‌.రెడ్డి, ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.