A 50-YEAR MASTER PLAN MULLED FOR VONTIMITTA TEMPLE _ వచ్చే 50 ఏళ్లకు సరిపడేలా ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్
Tirupati, 05 December 2025: TTD EO Sri Anil Kumar Singhal instructed the officials concerned to prepare a comprehensive 50-year Master Plan for the development of the historic Sri Kodandarama Swamy Temple at Vontimitta in Kadapa district.
During a review meeting held at the TTD Administrative Building in Tirupati on Friday evening, the EO said the plan should estimate future devotee inflow and provide for required infrastructure, accommodation, transportation, greenery, spiritual ambience, and technological features.
He suggested including Kalyanakatta, Pushkarini, Nakshatra Vanams, gardens, spiritual symbols, a museum, cultural hall, digital screens, enhanced lighting, decorative arches, CC cameras, development of Mada Streets, and a 108-ft Jambavan statue at the temple tank.
Officials from Vigilance, Forest, Annaprasadam, Electrical, Gardening, and other wings will participate in preparing the Master Plan.
Dr. Anil Kumar from the School of Planning and Architecture, Vijayawada, presented the concept.
TTD CE Sri T.V. Satyanarayana, SE-1 Sri Manoharam, and other officials participated.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
వచ్చే 50 ఏళ్లకు సరిపడేలా ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్
తిరుపతి / ఒంటిమిట్ట, 2025, డిసెంబర్ 05: పురాతన ప్రాశస్థ్యం ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయానికి వచ్చే 50 ఏళ్లకు సరిపడేలా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో శుక్రవారం అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, వచ్చే 50 సంవత్సరాల నాటికి భక్తులు రోజుకు ఎంత మంది రావచ్చు, ఆలయ పరిసరాలు ఎలా ఉండాలి, భక్తులకు సరిపడేలా మౌళిక సదుపాయాలు, వసతి, రవాణా, చారిత్రక నేపథ్యం ఉట్టిపడేలా, ఆధ్యాత్మికత, మరింతగా భక్తులు వచ్చేలా ముందస్తు ప్రణాళికలతో మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. భక్తుల సౌకర్యార్థం కల్యాణకట్ట, పుష్కరిణి, నక్షత్ర వనాలు, గార్డెనింగ్, పచ్చదనం, ఆధ్యాత్మిక చిహ్నాలు, శ్రీ కోదండరామ స్వామి ప్రాశస్థ్యం నవతరానికి అందించేలా మ్యూజియమ్, ఉద్యానవనాలు, సాంకేతికతను జోడించి డిజిటల్ స్క్రీన్స్, హనుమంతుడి సేవా నిరతి, సాంస్కృతిక కళామందిరం, లైటింగ్, తోరణాలు, చెరువులో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహాం, నాలుగు మాడ వీధుల అభివృద్ధి, సిసి కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని సూచించారు.
మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో టిటిడి విజిలెన్స్, అటవీశాఖ, అన్నదానం, గార్డెనింగ్, ఎలక్ట్రికల్ తదితర శాఖల అధికారులను భాగస్వామ్యం చేసి ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ను తయారు చేయాలని ఇంజనీరింగ్ ఆదేశించారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన స్కూల్ ఆప్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ డా. అనిల్ కుమార్ మాస్టర్ ప్లాన్ కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టిటిడి సీఈ శ్రీ టివి సత్యనారాయణ, ఎస్.ఈ-1 శ్రీ మనోహరం, తదితర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



