VARALAKSHMI VRATHAM TO BE OBSERVED ON AUGUST 8 AT TIRUCHANOOR _ వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తానికి జూలై 31న ఆన్‌లైన్‌లో టికెట్లు జారీ

ONLINE TICKETS AVAILABLE FROM JULY 31

Tirupati, July 29, 2025: One of the most sacred and widely observed festivals by the Hindu devotees, the Varalakshmi Vratham, will be conducted with religious fervor on Friday, August 8 at the Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor.

The Varalakshmi Vratham will be performed from 10 AM to 12 Noon at the Asthana Mandapam.

In the evening, at 6 PM, Sri Padmavathi Ammavaru will be taken in a grand procession along the Mada streets on the golden chariot (Swarna Ratham), blessing the devotees.

The event will be telecast live on Sri Venkateswara Bhakti Channel (SVBC).

Ticket Booking Details:

150 tickets will be released online at 10 AM on July 31 for devotees wishing to participate directly in the Vratham.

Another 150 tickets will be available via current booking at the Kumkumarchana counter in the temple on August 7 from 9AM.

Each ticket is priced at Rs. 1000/-, and two persons will be allowed per ticket.

Cancellation of Other Sevas:

In view of the Varalakshmi Vratham, TTD has cancelled Abhishekam,

Vastralankarana Seva, Abhishekanantara Darshanam, Lakshmi Puja, Kalyanotsavam, Unjal Seva, VIP Break Darsham and Veda Ashirvachanam on August 08.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తానికి జూలై 31 ఆన్‌లైన్‌లో టికెట్లు జారీ

తిరుపతి, 2025 జూలై 29: తిరుచానూరులో ఆగ‌స్టు 8వ తేదీ శుక్ర‌వారం శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు.  

ఆస్థానమండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వ్ర‌తాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది.

భ‌క్తులు నేరుగా వ్ర‌తంలో పాల్గొనేందుకు జూలై 31న ఉద‌యం 9 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో 150 టికెట్లు జారీ చేస్తారు. అదేవిధంగా ఆల‌యం సమీపం కౌంటర్‌లో ఆగ‌స్టు 7న ఉదయం 9 గంటలకు కరెంట్‌ బుకింగ్‌లో 150 టికెట్లు విక్రయిస్తారు. రూ.1000/- చెల్లించి భక్తులు టికెట్‌ కొనుగోలు చేయవచ్చు. ఒక టికెట్‌పై ఇద్దరు గృహస్తులను అనుమతిస్తారు.

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయంలో అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజ‌ల సేవ‌, బ్రేక్ ద‌ర్శ‌నం, వేద ఆశీర్వ‌చ‌నం సేవలను టిటిడి రద్దు చేసింది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.