GOPUJA HELD IN VASANTHA MANDAPAM _ వసంత మండపంలో శాస్త్రోక్తంగా గోపూజ
Tirumala, 29 November 2023: As part of the Vishnu Pujas organized by TTD in the month of Kartika, Gopuja was held at Tirumala Vasanta Mandapam on Wednesday that was telecasted live by SVBC for the sake of global devotees.
Initially, Sri Venugopala Swamy along with Rukmini and Satyabhama were seated them in Vasanta Mandapam. On this occasion, Sri Mohana Rangacharyulu, Vaikhanasa Agama Advisor said that cow is very important in Hjndu Sanatana Dharma and Gopuja is equal to the worship of the three crore deities mentioned in ancient sacred texts.
Later Go Puja was performed to a cow and calf.
Vedic pundits, devotees participated.
వసంత మండపంలో శాస్త్రోక్తంగా గోపూజ
తిరుమల, 2023 నవంబరు 29: కార్తీక మాసంలో టీటీడీ తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా బుధవారం తిరుమల వసంత మండపంలో గోపూజ శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 8.30 నుండి 10 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ముందుగా రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారిని వసంత మండపంలో కొలువుతీర్చారు. ఈ సందర్భంగా వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు మాట్లాడుతూ సనాతన ధర్మంలో గోవుకు ఎంతో ప్రాధాన్యత ఉందని, గోపూజ ముక్కోటి దేవతల పూజాఫలంతో సమానమని అన్నారు.
ముందుగా కార్తీక విష్ణుపూజా సంకల్పం చేసి ప్రార్థనా సూక్తం, విష్ణుపూజా మంత్ర పఠనం చేశారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లకు తిరువారాధన చేశారు. అనంతరం ఆవు, దూడకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హారతి సమర్పించారు. గోప్రదక్షిణ చేశారు. అనంతరం క్షమా ప్రార్థన, మంగళంతో ఈ పూజ ముగిసింది.
ఈ కార్యక్రమంలో ధర్మగిరి వేద పాఠశాల వేదపండితులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.