TTD EO TAKES PART IN SRI SRINIVASA KALYANAM HELD AT VARANASI _ వారణాసిలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
Tirumala, 18 February 2025: TTD organized Sri Srinivasa Kalyanam in Varanasi on Tuesday at the Birla Mandir of the Benares Hindu University as a part of its religious festivities in the ongoing Mahha Kumbhmela and TTD EO Sri J Syamala Rao participated in the divine event.
Initially, the priests brought Sridevi and Bhudevi along with Sri Swamivaru to the Kalyanam venue.
After that, amidst the chanting of Vedic mantras series of rituals including Sri Vishvaksena Aradhana, Punyahavachanam Maha Sankalpam, Mangalya Puja, Mangala Sutradharana were held.
Finally, the Kalyanam concluded successfully with Nakshatra Harati and Mangala Harati being offered to the utsava deities.
Devotees who witnessed the celestial wedding were thrilled with devotion.
HDPP Program Officer Sri Raja Gopal, Paru Pattedar Sri Bala Subrahmanyam and other officials participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వారణాసిలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
తిరుమల, 2025 ఫిబ్రవరి 18: మహా కుంభమేళా సందర్భంగా వారణాసిలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని బిర్లా మందిర్ లో మంగళవారం శ్రీ శ్రీనివాస కల్యాణాన్ని టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహించింది.
ముందుగా అర్చక బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ స్వామి వారి ఉత్సవర్లను కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు.
అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ విష్వక్సేనారాధన, పుణ్యహ వచనం, కంకణ ధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహా సంకల్పం, మాంగళ్య పూజ, మంగళ సూత్రధారణ మొదలయిన ఘట్టాలతో శాస్త్రోక్తంగా శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని నిర్వహించారు.
చివరిగా శ్రీ స్వామి అమ్మవార్లకు నక్షత్ర హారతి, మంగళహారతి సమర్పించడం తో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తి పరవశంతో పులకించారు.
అనంతరం బిర్లా మందిర్ వద్దకు శ్రీ స్వామివారిని వేంచేపు చేసి హారతి సమర్పించగా, టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు చేతులు మీదుగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హెచ్ డీపీపీ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీ రాజ గోపాల్, పారు పత్తేదార్ శ్రీ బాల సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.