ALL OUT TTD SUPPORT FOR VINAYAKA NIMARJANAM FETE -TTD CHAIRMAN _ వినాయక నిమజ్జనానికి టీటీడీ సంపూర్ణ సహకారం-టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి
* NO NIMARJANAM ON SEP 22 ON GARUDA SEVA DAY
Tirupati, 01 September 2023: TTD Chairman Sri Bhumana Karunakar Reddy on Friday appealed to Vinayaka Nimarjanam Committee members and officials to take suitable action to ensure that the Nimarjanam fete is not held on the prestigious Garuda Seva day on September 22.
Addressing a review meeting with the Vinayaka Nimarjanam Committee, Municipal Corporation, TTD and other city officials at the Tirupati Municipal Corporation premises, the chairman said every effort should be made to maintain the spiritual atmosphere in Tirupati city during the Vinayaka Festival.
He appealed to city committee heads that TTD will make all arrangements as in last year to ensure that the Nimarjanam fete is observed in highly religious fervour.
TTD will distribute Goddess Padmavati Kankanams and kumkumam to all devotees at the Vinayaka sagar and also arrange other Dharmic and cultural programs by the HDPP and other projects.
On September 22, the focus of all TTD and district administration including police, TUDA, Revenue and SPDCL will be on the Brahmotsava Garuda Seva fete.
TMC mayor Dr Shirisha, Commissioner Smt Haritha, Deputy Mayor Sri Mudra Narayana, RDO Sri Kanaka Narasa Reddy, TTD SE Sri Satyanarayana, Additional SP Sri Kulasekara, Nimarjanam committee members Sri Samanchi Srinivas, Sri RC Munikrishna, Sri Gopal Reddy, Sri Gopinath and other were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
వినాయక నిమజ్జనానికి టీటీడీ సంపూర్ణ సహకారం
– సెప్టెంబరు 22న గరుడ సేవ రోజు నిమజ్జనాలు వద్దు
టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి
తిరుపతి 1 సెప్టెంబరు 2023: తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమానికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ జరిగే సెప్టెంబరు 22వ తేదీ వినాయక నిమజ్జనాలు జరగకుండా వినాయక నిమజ్జన కమిటీ ప్రతినిధులు, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం శ్రీ కరుణాకర రెడ్డి నగరపాలక సంస్థ, టీటీడీ , ఇతర శాఖల అధికారులు, నిమజ్జన కమిటీతో సమావేశం జరిపారు.
ఈ సందర్బంగా శ్రీ కరుణాకర రెడ్డి మాట్లాడుతూ, వినాయక నిమజ్జనం ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగేందుకు గత ఏడాది లాగే ఈ సారి కూడా టీటీడీ వైపు నుండి అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. వినాయక సాగర్ వద్ద భక్తులందరికీ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కుంకుమ, కంకణాలు అందిస్తామని చెప్పారు. తిరుమలలో స్వామి వారి గరుడ సేవ జరిగే రోజునే వినాయక విగ్రహాల ఐదవ రోజు నిమజ్జనం వస్తోందన్నారు. తిరుమలకు గత ఏడాది కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు . అధికార యంత్రాంగం తిరుమలలో ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉన్నందున 5 వ రోజు వినాయక విగ్రహ నిమజ్జనాలు లేకుండా చర్యలు తీసుకోవాలని నిమజ్జన కమిటీ, అధికారులకు శ్రీకరుణాకర రెడ్డి సూచించారు. వినాయక చవితి సందర్బంగా వినాయక సాగర్ వద్ద టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అవసరమైన మేరకు ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగర పాలక సంస్థ ఈ సారి కూడా అధికారికంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తుందన్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం పోలీస్, తుడ, రెవెన్యూ, ఎస్పీడీసీఎల్ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని చైర్మన్ శ్రీకరుణాకర రెడ్డి చెప్పారు.
మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ శ్రీమతి హరిత, ఉప మేయర్ శ్రీ ముద్ర నారాయణ, ఆర్డీవో శ్రీకనక నరసారెడ్డి, టీటీడీ ఎస్ఈ శ్రీసత్యనారాయణ, అదనపు ఎస్పీ శ్రీకులశేఖర్ తో పాటు వివిధ శాఖల అధికారులు, నిమజ్జన కమిటీ ప్రతినిధులు శ్రీ సామంచి శ్రీనివాస్, శ్రీ ఆర్సీ మునికృష్ణ, శ్రీ మాంగాటి గోపాలరెడ్డి, శ్రీ గుండాల గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది