వివరణ

”ఓ ఎమ్మెల్యే అత్యుత్సాహం” టిక్కెట్లు లేకుండా అనుచరులతో ఆలయం ప్రవేశం అనువార్త సత్యదూరం

జనవరి 2వ తేదీ 2009న ఈనాడు దినపత్రికలో ”ఓ ఎమ్మెల్యే అత్యుత్సాహం” టిక్కెట్లు లేకుండా అనుచరులతో ఆలయం ప్రవేశం అనువార్త సత్యదూరం.

నూతన సంవత్సరం సందర్భంగా ప్రోటోకాల్‌ విఐపీలను శ్రీవారి దర్శనానికి తక్కువ సంఖ్యలో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారా ఆలయంలోనికి పంపడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కూడా తన కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనానికి వెళ్ళడం జరిగింది. అయితే సదరు వార్తలో ఎమ్మెల్యే కూడా 40 మంది అనుచరులతో దురుసుగా లోనికి వెళ్ళిపోయారని ఈచర్యను తితిదే అధికారులు చూస్తూ ఉండిపోవాల్సివచ్చిందని పేర్కొనడం కూడా నిజంకాదు. ఎందుకంటే ప్రొటోకాల్‌ విఐపిల దర్శనం చాలా చక్కగా, సాఫీగా జరిగింది. తరువాత 3 గంటలకే సర్వదర్శనం ప్రారంభమైంది. వేలాది మంది సామాన్య భక్తులు ఈ సమయంలో శ్రీవారిని దర్శించుకొని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. కనుక పై విషయాన్ని రేపటి మీ దినపత్రికనందు వివరణగా ప్రచురించాల్సిందిగా కోరడమైనది.

టి. రవి
ప్రజాసంబంధ అధికారి,
తి.తి.దే., తిరుపతి.