వివరణ
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి
వివరణ
తిరుపతి, 2010 ఆగష్టు 25: ఆగష్టు 24వ తేదిన ”సాక్షి ” దినపత్రిక నందు ప్రచురించిన ”టిటిడికి స్పెసిఫైడ్ అథారిటీ!” అధికారుల మధ్య విబేధాలు అని ప్రచురించిన వార్త అవాస్తవం.
ప్రస్తుతం దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్నరమణాచారి నేతృత్వాన అథారిటీ ఏర్పాటు చేయటాన్ని వ్యతిరేకిస్తు ఇ.ఓ.కృష్ణారావు ప్రభుత్వానికి లేఖ వ్రాశారని, బాధ్యతలు తనకే అప్పగించాలని విజ్ఞప్తి చేసినట్లు వచ్చిన వార్త పూర్తిగా నిరాధారం. వాస్తవానికి స్పెసిఫైడ్ అథారిటీలో ఎవరెవరు వుండాలో నిర్ణయించేది ప్రభుత్వమే తప్ప తితిదే ఇ.ఓ. కాదని తెలియజేస్తున్నాం.
కనుక ఈ సమాచారాన్ని రేపటి మీ దినపత్రికలో ఈ విషయాన్ని వివరణగా ప్రచురించాల్సిందిగా కోరుచున్నాము.
ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి